Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’లో మీనాక్షి ఫిక్స్.. స్వయంగా లీక్ చేసిన హీరోయిన్.. పూజా హెగ్డే ప్లేస్‌లో..

పూజా హెగ్డే ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకున్నట్టు కొంతమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారని సమాచారం.

Meenakshi Chaudhary : ‘గుంటూరు కారం’లో మీనాక్షి ఫిక్స్.. స్వయంగా లీక్ చేసిన హీరోయిన్.. పూజా హెగ్డే ప్లేస్‌లో..

Meenakshi Chaudhary replace Pooja Hegde place in Mahesh Babu Guntur Kaaram Movie

Updated On : July 17, 2023 / 6:31 AM IST

Guntur Kaaram :  త్రివిక్రమ్(Trivikram)- మహేష్ బాబు(Mahesh Babu) కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా గుంటూరు కారం. సినిమా ఎప్పుడో మొదలయిన ఇప్పటిదాకా సగం షూటింగ్ కూడా అవ్వలేదు. అనేక కారణాలతో ఈ సినిమా షూట్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) కూడా తప్పుకుంది. ఇప్పటికే ఈ సినిమాపై మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

పూజా హెగ్డే ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకున్నట్టు కొంతమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారని సమాచారం. తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తాను గుంటూరు కారంలో నటిస్తున్నాను అని లీక్ చేసింది.

హిట్, ఖిలాడీ, ఇచ్చట వాహనాలు నిలుపరాదు.. లాంటి పలు తెలుగు సినిమాలతో మెప్పించింది మీనాక్షి చౌదరి. త్వరలో విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపింది.

Jailer : రజినీకాంత్ ‘జైలర్’ సినిమాపై కోర్టులో పిటిషన్.. టైటిల్ నాది అంటున్న మలయాళం డైరెక్టర్..

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమాలో పనిచేయడం చాలా గొప్పగా ఉంది. నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. షూటింగ్ లో మహేష్ బాబు గారితో మొదటి రోజు, మొదటి షాట్ మర్చిపోలేని అనుభూతి. ఈ సినిమా విషయంలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అని ప్రకటించింది. మొత్తానికి ఇంకో హీరోయిన్ ని ఫైనల్ చేసి షూటింగ్ మొదలుపెట్టారని మహేష్ అభిమానులు సంతోషిస్తున్నారు.