×
Ad

Meenakshi Chowdhury: చిరంజీవితో సినిమా.. నా లైఫ్ లో కొత్త ఛాప్టర్.. ఆ విషయంలో నో చెప్పేస్తాను..

టాలీవుడ్ లేటెస్ట్ హిట్ బ్యూటీగా మారిపోయింది మీనాక్షి చౌదరి. ఈ ఈమధ్య కాలంలో(Meenakshi Chowdhury) ఆమె చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి.

Meenakshi Chowdhury made interesting comments about Chiranjeevi's Vishwambhara movie

Meenakshi Chowdhury: టాలీవుడ్ లేటెస్ట్ హిట్ బ్యూటీగా మారిపోయింది మీనాక్షి చౌదరి. ఈ ఈమధ్య కాలంలో ఆమె చేసిన సినిమాలు (Meenakshi Chowdhury)బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. అందుకే ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లక్కీ చార్మ్ గా మారిపోయింది. ఇటీవల ఆమె వెంకటేష్ తో చేసిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తరువాత కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది మీనాక్షి. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్ లో కొత్త ఛాప్టార్ మొదలయ్యింది అంటూ చెప్పుకొచ్చింది. అదే మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న సినిమా విశ్వంభర. ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చింది మీనాక్షి.

Shiva Sequel:’శివ’ సీక్వెల్.. హీరోగా అక్కినేని వారసుడు.. ఆర్జీవీ మాములు కౌంటర్ ఇవ్వలేదుగా

“కేవలం ఇలాంటి పత్రాలు మాత్రమే చేయాలనీ ఎప్పుడు అనుకోలేదు. ఎలాంటి పాత్రైనా చేసినప్పుడు మాత్రమే మన నటనకు విలువ ఉంటుంది. కానీ, ఇకనుంచి పిల్లలు ఉన్న తల్లి పాత్రలు మాత్రం చేయను. లక్కీ భాస్కర్ కేవలం కథ నచ్చి మాత్రమే చేశాను. ఇకనుంచి మొహమాటం లేకుండా ‘నో’ చెప్పేస్తాను. ఇక పెద్ద హీరోలతో చేయడానికే ఎలాంటి ఇబ్బంది లేదు. అదొక కొత్త జానర్‌గా ఫీలవుతాను. వెంకటేశ్‌ గారితో చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ షూటింగ్‌ను బాగా ఎంజాయ్‌ చేసాం. ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో స్పెషల్‌ ఛాప్టర్‌గా నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక మీనాక్షి చౌదరి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె అక్కినేని నాగ చైతన్యతో ఓ సినిమా చేస్తోంది. విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మరోసారి థ్రిల్లర్ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన మీనాక్షి లుక్ కి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.