Shiva Sequel:’శివ’ సీక్వెల్.. హీరోగా అక్కినేని వారసుడు.. ఆర్జీవీ మాములు కౌంటర్ ఇవ్వలేదుగా
అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'శివ'. కేవలం బ్లాక్ బస్టర్ మూవీనే కాదు ఎవరు గ్రీన్ మూవీ (Shiva Sequel)కూడా. ఈ సినిమాను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు.
Director Ram Gopal Varma makes shocking comments on Shiva sequel
Shiva Sequel: అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. కేవలం బ్లాక్ బస్టర్ (Shiva Sequel)మూవీనే కాదు ఎవరు గ్రీన్ మూవీ కూడా. ఈ సినిమాను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత్ బ్రేకర్ గా నిలిచిన ఈ సినిమా విడుదలై 36 ఏళ్ళు గడుస్తున్న వేళ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ సినిమా 4K క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
Janhvi Kapoor: బంగారు కలర్ డ్రెస్ లో బంగారంలా.. మెరిసిపోతున్న జాన్వీ.. ఫోటోలు
తాజాగా మీడియా మీట్ కూడా నిర్వహించారు. ఈ మీట్ లో హీరో అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఇందిలో భాగంగా మీడియా అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ శివ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ మీడియా మీట్ లో ఒక రిపోర్టర్ ఆసక్తికర ప్రశ్న ఆర్జీవీని అడిగాడు.. శివ సినిమాకు సీక్వెల్ చేస్తే ఎవరితో చేస్తారు.. నాగ చైతన్య, అఖిల్ అని అడిగాడు. దానికి ఆర్జీవీ ఆయన స్టయిల్లోనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరు కాదు. శివ అనేడి నాగార్జున కోసం చేసిన సినిమా. ఆ పాత్రలో ఇంకెవరినీ ఊహించుకోలేం.
ఈ మధ్యే వచ్చే సినిమాల్లో హీరో టెన్షన్ పడే సన్నివేశాలు పెట్టడంలేదు. ఇంట్రడక్షన్ సీన్/సాంగ్‌తోనే ఏదైనా చేయగలడు అని చెప్పేస్తున్నారు. కానీ, శివ సినిమాలో హీరో ఒక సాధారణ వ్యక్తి. కాబట్టి, హీరోయిజం ఎలివేట్ అయ్యింది. అందుకే మీరు తప్పకుండా శివ సినిమాను మళ్లీ ఎంజాయ్ చేస్తారు’’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
