Mega Brothers: చిరు-పవన్ రీమేక్స్.. ఫ్యాన్స్‌లో ఏదో అసంతృప్తి!

సేఫ్ గేమ్ అనుకుంటున్నారో.. కలిసి వచ్చిన ఫార్మేట్ అనుకుంటున్నారో కానీ.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Mega Brothers

Mega Brothers: సేఫ్ గేమ్ అనుకుంటున్నారో.. కలిసి వచ్చిన ఫార్మేట్ అనుకుంటున్నారో కానీ.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రీమేక్ సినిమాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్ లాంటి హీరో రీమేక్ చేసాడంటే సేఫ్ గేమ్ తప్పులేదనిపిస్తుంది. కానీ చిరంజీవి లాంటి మెగాస్టార్ ఇమేజ్ ఉన్న హీరో కూడా ఇంకో భాషలో హిట్టైన కథను మళ్ళీ ఇక్కడ చూపించడం ఎందుకో అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. పవన్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ రీమేక్ సినిమాలే కావడం విశేషం.

Mega Brothers : మెగా బ్రదర్స్ పిక్ అదిరిందిగా..!

ముందుగా చిరంజీవినే తీసుకుంటే ఖైదీ నంబర్ 150, చేస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ రెండూ రీమేక్ సినిమాలే. ఇంతకు ముందొచ్చిన సైరా నరసింహారెడ్డి రీమేక్ కాకపోయినా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఓ వ్యక్తి కథ కనుక అది కూడా సేఫ్ గేమ్ కిందే లెక్క. ఇక పవన్ కూడా ఖుషీ దగ్గర నుండి ఈ మధ్యనే వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వరకు రీమేక్ సినిమాల మీదే ఆధారపడ్డాడనే అపవాదు మోస్తున్నాడు. అది చాలదని త్వరలోనే వినోదయ సిత్తం అనే తమిళ సినిమా కూడా మొదలు పెట్టనున్నట్లు టాక్ నడుస్తుంది.

Pawan Kalyan : పవర్‌స్టార్.. క్రేజ్‌కి కేరాఫ్..

రీమేక్ కథలంటే సక్సెస్ శాతం ఎక్కువ కనుక ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదు. ఒక విధంగా ఇది మంచిదే కానీ.. ఇప్పుడు కాలం మారింది. భాషతో సంబంధం లేకుండా ఎక్కడ సినిమాలనైనా చూసేస్తున్నారు మన ప్రేక్షకులు. మరోవైపు ఓవర్సీస్ లో ఇండియాలో బాషలతో సంబంధం లేకుండా ఇండియన్ అనే సినిమా లెక్కలు ఉంటాయి. అయితే.. ఆల్రెడీ ఒక భాషలో వచ్చిన సినిమాను మళ్ళీ తెలుగు రీమేక్ చేయడంతో ఓవర్సీస్ లో పెద్దగా ఆసక్తి ఉండడం లేదు. హీరో బ్రాండ్ తో అభిమానులు ఆదరిస్తున్నా.. అది హీరోల ఇమేజ్ కి తగ్గ రేంజ్ కాదని అక్కడి లెక్కలు చూస్తే తెలుస్తుంది.

Mega Brothers : మేనల్లుడి కోసం మెగా బ్రదర్స్..

ఒకపక్క ప్రభాస్ గ్లోబల్ స్టార్ స్కెచ్ వేస్తుంటే.. అల్లు అర్జున్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇక ఎన్టీఆర్-రామ్ చరణ్ ఒకేసారి పాన్ ఇండియా రికార్డులకు ఎక్కు పెట్టేశారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా అదే దారిలో సిద్దమవుతున్నాడు. వీళ్ళే కాదు నిన్న గాక మొన్న వచ్చిన అడవి శేష్ లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయి కథలు కావాలంటుంటే ఇంత కెపాసిటీ ఉన్న చిరు-పవన్ మాత్రం రీమేక్ కథలవైపు చూడడం ఓ వర్గం అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు.

Salman Khan : చిరుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సల్లూ భాయ్..

ఎంత మార్పులు చేసినా.. ఎంత కల్పితాలు చేసినా ఆల్రెడీ చూసేసిన కథ అంటే పాత సీసాలో కొత్త సారానే. ఆ టేస్ట్ ఓవర్సీస్ ప్రేక్షకులకు అసలు నచ్చదు. మన తెలుగులో తప్ప మిగతా ఇండియా స్థాయిలో కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కదు. అయితే.. పాన్ ఇండియా స్థాయికి చేర్చే దర్శకులు ఎవరనే ప్రశ్న కూడా రావడం సహజమే. రాజమౌళి-సుకుమార్ ఇప్పటికే ఈ టాస్క్ దిగ్విజయంగా పూర్తి చేయగా.. కొరటాల లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం మొదలు పెట్టారు. సో ఇదే బాటలో మరికొందరు సిద్దమవడం ఖాయం కనుక.. వాళ్ళకి మెగాస్టార్-పవర్ స్టార్ లాంటి బూస్టప్ ఇస్తే అదేం పెద్ద పని కాదు.. అయితే.. అసలు ఇప్పుడు మెగా బ్రదర్స్ ఆ ఆలోచన చేస్తారా అన్నదే ఆ అభిమానుల మెదళ్లలోనే దాగిన ప్రశ్న!