Mega Hero Varun Tej Matka Movie is coming to OTT within 20 days
Matka : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో నవంబర్ 14న విడుదలైన ఈ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరో కీలక పాత్రలో కనిపించింది.
Also Read : Vivek Oberoi : సంపాదనలో ఆ స్టార్ హీరోలనే వెనక్కి నెట్టిన బాలీవుడ్ నటుడు.. అన్ని కోట్లకు అధిపతా
థియేటర్లలో ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా చేసారు. డిసెంబర్ 5న మట్కా సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మట్కా స్ట్రీమింగ్ కానుంది.
risk, reward & gamble – MATKA Vasu is the ringmaster who rules them all 👑#MatkaOnPrime, December 5 pic.twitter.com/Djsux1H6nJ
— prime video IN (@PrimeVideoIN) November 30, 2024
మరి థియేటర్స్ లో పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన తెచుకుంటుందో చూడాలి. ఇప్పటికే వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న వరుణ్ ఈ సినిమాతో అయినా మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో అని వెయిట్ చేసారు మెగా ఫ్యాన్స్. కానీ ఈ సినిమాతో మరో ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్. మట్కా కోసం వరుణ్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెలిపాడు. మట్కాలోని నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించి రిస్క్ చేసినప్పటికీ ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.