వంశీకి చిరు ఫోన్ : టపాసులు కాల్చిన మహర్షి టీమ్
రిలీజ్ రోజు రాత్రి మహర్షి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న మూవీ యూనిట్, రెండవ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడంతో పాటు కేక్ కట్ చేసి టపాసులు కూడా కాల్చారు..

రిలీజ్ రోజు రాత్రి మహర్షి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న మూవీ యూనిట్, రెండవ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడంతో పాటు కేక్ కట్ చేసి టపాసులు కూడా కాల్చారు..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి కలిసి నిర్మించిన మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఉదయం ఆటనుండే పాజిటివ్ టాక్‌తో, అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది మహర్షి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ.24.6 కోట్లు వసూలు చెయ్యడం విశేషం.. రిలీజ్ రోజు రాత్రి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న మూవీ యూనిట్, రెండవ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చెయ్యడంతో పాటు కేక్ కట్ చేసి టపాసులు కూడా కాల్చారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం ఒకే నంబర్ నుండి కాల్ వస్తుండడంతో ఎవరబ్బా అని లిఫ్ట్ చేసాను.. అవతలి నుండి వంశీ.. అన్నారు.. అవునండీ, మీరెవరు అనగానే, నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను అన్నారు.. వెంటనే రోమాలు నిక్కబోడుచుకున్నాయి. చిరంజీవి గారు కాల్ చేసి, అభినందించడమే కాక, మహర్షిలోని ప్రతీ పాయింట్ గురించి మాట్లాడడం జీవితంలో మర్చిపోలేను అని చెప్పాడు. సినిమా అన్ని సెంటర్స్‌లో బాగా రన్ అవుతుందని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు అన్నారు. తర్వాత టీమ్ అంతా కలిసి టపాసులు కాల్చారు