సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగాస్టార్ CDP, Motion Poster..

Megastar Chiranjeevi Birthday Trend: మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవ సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. రేపు(ఆగస్ట్ 22)న చిరంజీవి పుట్టినరోజు.. మెగాభిమానులకు పండుగరోజు.. ఈ సారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చిరు బర్త్‌డే వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినా ఆన్‌లైన్ ద్వారా అభిమానులంతా వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సీడీపీని రిలీజ్ చేయడంతో మెగా వేడుక స్టార్ట్ అయింది. చిరు కెరీర్ ప్రారంభం నుంచి ‘సైరా’ వరకు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాల్లోని పలు గెటప్‌లను చూపిస్తూ డిజైన్ చేసిన పోస్టర్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే బర్త్‌డే మోషన్ పోస్టర్ కూడా రోమాలు నిక్కబొడుచుకునేలా రూపొందించారు. మెగాస్టార్ CDP, Motion Poster సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.