Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 అంటే ఫ్యాన్స్ అందరికి పండగే. అసలే ఈసారి చిరు 70వ పుట్టినరోజు. దీంతో ఫ్యాన్స్ మరింత స్పెషల్ గా సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఇక ఫ్యాన్స్ తమ అభిమాన హీరో సినిమాల నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.(Megastar Chiranjeevi)
ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వంభర షూటింగ్ అయిపోగా, టాలీవుడ్ సమ్మె వల్ల అనిల్ రావిపూడి సినిమా షూట్ వాయిదా పడింది. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజున ఈ రెండు సినిమాలు నుంచి అప్డేట్స్ ఉన్నాయని తెలుస్తుంది.
Also Read : Rahul Sipligunj : తన నిశ్చితార్థం నుంచి మరిన్ని ఫోటోలు షేర్ చేసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు చూశారా?
విశ్వంభర సినిమా నుంచి ఆగస్టు 22న టీజర్ రిలీజ్ చేస్తారని సమాచారం. గతంలో గ్లింప్స్ రిలీజ్ చేసి VFX విషయంలో విమర్శలు ఎదుర్కొంది ఈ సినిమా. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికి సమాధానం చెప్పేలా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అలాగే విశ్వంభర రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. విశ్వంభర సినిమా 2025 సంక్రాంతికి రావాల్సిన సినిమా. అప్పట్నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవ్వక వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా టైటిల్ ని ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజున అనౌన్స్ చేస్తామని ఇటీవల అనిల్ రావిపూడి ఓ ఈవెంట్లో తెలిపారు. చిరు – అనిల్ సినిమా 2026 సంక్రాంతికి రానుంది. టాలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్’ అనే టైటిల్ ని అనుకున్నట్టు తెలుస్తుంది. మరి ఆ టైటిల్ నే ప్రకటిస్తారా లేక కొత్తగా ఏదైనా అనౌన్స్ చేస్తారా చూడాలి. దీంతో ఈ సారి చిరు పుట్టిన రోజు రెండు సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి మరింత పండగలా మారనుంది.
Also Read : Kalanithi Maran : అంతా అయిపోయాక ఇప్పుడెందుకు? కూలీ కోసం కోర్టుకెళ్లిన నిర్మాత.. ఇదేదో ముందే చెయ్యాల్సింది..