Chiranjeevi : 104 జ్వరంతో కూడా ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసిన మెగాస్టార్.. సినిమా కోసం చిరు డెడికేషన్..

మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

Chiranjeevi : 104 జ్వరంతో కూడా ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసిన మెగాస్టార్.. సినిమా కోసం చిరు డెడికేషన్..

Megastar Chiranjeevi Dance in Jagadeka Veerudu Atiloka Sundari with 104 Fever

Updated On : May 6, 2025 / 8:50 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. ఎన్నో సినిమాలలో తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ లో నెంబర్ 1 గా ఎదిగి సినీ పరిశ్రమను రూల్ చేసారు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ లు అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన డేట్ రోజే అంటే మళ్ళీ మే 9 రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ అప్పటి సంగతులను రోజుకొకటి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తాజాగా ఓ ఆసక్తికర విషయం తెలిపింది మూవీ యూనిట్.

Also Read : Samantha : అలాంటివి నేను ఎంకరేజ్ చేయను.. సమంత కామెంట్స్ వైరల్..

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో దినక్కుతా.. అనే సాంగ్ షూటింగ్ సమయంలో చిరంజీవికి ఫుల్ ఫీవర్ వచ్చిందట. 104.6 డిగ్రీల జ్వరం ఉందట. అయినా సరే షూటింగ్ పూర్తవ్వాలని అదే జ్వరంతో మాస్ సాంగ్ కి ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసారట చిరంజీవి. శ్రీదేవితో కలిసి ఆ జ్వరంతోనే డ్యాన్సులు అదరగొట్టేసారు చిరంజీవి అని తెలిపారు.

దీంతో అంత జ్వరంలో కూడా మెగాస్టార్ డ్యాన్స్ అదిరిపోయేలా చేసాడంటే సినిమా కోసం బాస్ డెడికేషన్ ఏంటో అర్థమైపోతుంది అని చిరుని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, సినిమా లవర్స్. 1990 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా సోషియో ఫాంటసీ గా తెరకెక్కిన జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పట్లో 2 కోట్లతో తెరకెక్కిస్తే ఆల్మోస్ట్ 15 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించింది. మరోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి మే 9న థియేటర్స్ లో సందడి చేయనుంది.

Also Read  : HariHara VeeraMallu : హమ్మయ్య ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అయిపోయింది.. లాస్ట్ డే ఫోటో విడుదల.. రిలీజ్ ఎప్పుడు?