Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీకి ఇంకో సినిమా ఇచ్చిన మెగాస్టార్..? ఆ నిర్మాతని ఆదుకోవడానికేనా?

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ డిజాస్టర్‌ నుంచి తేరుకుని నెక్ట్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.

Chiranjeevi : ‘వాల్తేరు వీరయ్య’ డైరెక్టర్ బాబీకి ఇంకో సినిమా ఇచ్చిన మెగాస్టార్..? ఆ నిర్మాతని ఆదుకోవడానికేనా?

Megastar Chiranjeevi gives another movie for Waltair Veerayya Director Bobby with AK Entertainments Producer Anil Sunkara

Updated On : September 2, 2023 / 12:40 PM IST

Chiranjeevi : వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో చిరంజీవికి హిట్ ఇచ్చిన దర్శకుడు బాబి(Director Bobby).. మెగాస్టార్‌(Mega Star)తో మరో సినిమాకు కమిట్ అయ్యారట. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనుందని టాలీవుడ్ సమాచారం. బాబి.. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి-రవితేజలతో మల్టీస్టారర్ మూవీ చేసి వాహ్వ అనిపించుకున్నారు. ఇప్పుడు మరో కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్న సమాచారం ఇంట్రస్టింగ్‌గా మారింది.

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ డిజాస్టర్‌ నుంచి తేరుకుని.. నెక్ట్స్ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో 200 రోజులు ఆడిన మూవీ వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీకి మరో చాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి తన నెక్స్ట్ రెండు సినిమాలని ఇటీవల తన పుట్టిన రోజు నాడు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మెగా 156 తన కూతురు నిర్మాణంలో ఉండనుంది. ఇది కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉండనున్నట్టు సమాచారం. ఇక మెగా 157వ సినిమా వసిష్ఠ దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మాణంలో భారీగా ఉండనున్నట్టు ప్రకటించారు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ చేస్తున్న సినిమాలో కూడా చిరంజీవి గెస్ట్ రోల్ లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రీడా నేపథ్యంతో చిత్రీకరించనున్న ఈ సినిమా షెడ్యూల్ డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది.

Kushi Movie Collections : ఖుషి ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ కెరీర్‌లోనే హైయెస్ట్.. సమంత స్టార్‌డమ్ బాగానే పనిచేసింది..

ఇలా వరుస సినిమాలను లైన్లో పెట్టిన బాస్ మరోవైపు బాబితోనూ సినిమాకు ఒకే చేసినట్లు సమాచారం వస్తుంది. భోళా శంకర్ తో నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టం రావడంతోనే అనిల్ సుంకరకు చిరంజీవి ఇంకో సినిమా ఇచ్చారని, అందుకే బాస్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద హిట్ ఇచ్చిన బాబీతోనే ఆ సినిమా తీయాలనుకుంటున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. నిర్మాత అనిల్ సుంకరను ఆదుకునేందుకే ఈ సినిమాకు బాస్ ఓకే చెప్పినట్టు టాక్. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో కానీ వాల్తేరు వీరయ్యలో చిరంజీవిని మాస్ వింటేజ్ లుక్‌లో చూపించి హిట్ కొట్టిన బాబి.. ఈ సారి సినిమా ఇస్తే ఇంకెలా చూపించి ఏ రేంజ్ హిట్ కొడతాడో అని అభిమానులు అనుకుంటున్నారు. ఇక బాబీ ప్రస్తుతం బాలకృష్ణతో బాలయ్య 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.