వైరల్ అవుతున్న మెగాస్టార్ మెగా పిక్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

  • Published By: sekhar ,Published On : January 7, 2019 / 07:48 AM IST
వైరల్ అవుతున్న మెగాస్టార్ మెగా పిక్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోని, మెగా కోడలు ఉపాసన ట్వట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ మెగా క్లిక్ వెనక ఉన్న కథేంటంటే, రీసెంట్‌గా ఉపాసన తల్లిదండ్రులు, చౌమహల్లా ప్యాలెస్‌లో, హైదరాబాదీ కల్చర్‌లో, తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కోసం డిన్నర్ ఏర్పాటు చేసారు. ఆ సందర్భంగా, డిన్నర్‌లో తమ టాలెంట్‌తో అక్కడి వారిని అలరించిన సూఫీ సింగర్స్‌ని అభినందిస్తూ, మెగాస్టార్ చిరంజీవి వారితో కలిసి ఒక ఫోటో దిగారు.గుబురు గెడ్డం, కుర్తాలో చిరు మెరిసి పోతున్నాడు.

హౌ స్వీట్ మామాయ్య అంటూ, ఉపాసన ఆ పిక్‌ని షేర్ చేసింది. చిరు, ఆయన భార్య సురేఖ, ఉపాసన పేరెంట్స్‌తో కలిసి తీసుకున్న మరో ఫోటో‌ని, నౌ దట్స్ ఏ రాయల్ పిక్.. అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ తీసింది ఉపాసనే కావడం విశేషం. చిరు లేటెస్ట్ పిక్స్‌ని మెగాభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.

Megastar Chiranjeevi Latest Pics Goes Viral