Megastar Chiranjeevi Name Changed In Godfather Teaser
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ నుండి ఫస్ట్ లుక్ టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో చిరు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
అయితే గాడ్‌ఫాదర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్‌ను గమనిస్తే.. అందులోని ఓ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ సాగుతోంది. ఈ సినిమా టీజర్‌లో చిరంజీవి పేరును మార్చి చూపించారు. సాధారణంగా ఇంగ్లీష్‌లో ఆయన పేరు CHIRANJEEVI అని వస్తుంది. అయితే గాడ్‌ఫాదర్ టీజర్‌లో మాత్రం MEGASTAR CHIRANJEEEVI అని పడింది. దీంతో చిరు తన పేరును మార్చుకున్నారా.. న్యూమరాలజీ ప్రకారం చిరు ఇలా తన పేరులో ఇంకో E అనే అక్షరాన్ని యాడ్ చేసుకుని ఉంటాడని సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది.
Godfather first look released: దసరాకు బాస్ వస్తున్నాడు.. గడగడలాడించే ‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ రిలీజ్
కాగా.. ఈ విషయంపై గాడ్‌ఫాదర్ చిత్ర టీమ్ నుండి తాజాగా క్లారిటీ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి తన పేరును మార్చుకోలేదని.. టీజర్ ఎడిటింగ్ సమయంలో జరిగిన చిన్న తప్పిదం కారణంగా చిరంజీవి పేరులో ఎక్స్‌ట్రా E పడిందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా చిరంజీవి పేరు మార్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో సాగుతున్న రచ్చకు గాడ్‌ఫాదర్ టీమ్ ఫుల్‌స్టాప్ పెట్టేసిందని చెప్పాలి. ఇక గాడ్‌ఫాదర్ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.