Chiranjeevi : ఊటీలో చలికాలంలో బట్టలు లేకుండా.. సినిమా కోసం చిరంజీవి సాహసం..

రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Megastar Chiranjeevi Tells Interesting Thing Happend on Jagadeka Veerudu Athiloka Sundari Shoot Time

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నేడు మే 9 రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి, డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ లతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి, సినిమా షూట్ లో జరిగిన అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

Also Read : Rajamouli : భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ.. అలా చేయొద్దు అంటూ రాజమౌళి ట్వీట్..

ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. నవంబర్, డిసెంబర్ చలికాలంలో షూట్ జరిగింది. ఊటీలో షూట్. ఫుల్ చలి. ఆ చలిలో ఫైట్ సీన్ పెట్టారు. ఆంజనేయస్వామి గెటప్ లో ఫైట్ సీక్వెన్స్, దానికి ఒంటిమీద బట్టలు లేవు. నేను చలికి వణికితే అందరూ ఆవేశంతో ఊగిపోతున్నాను అనుకున్నారు. ఆ చలిలోనే ఫైట్ చేశాను. కానీ ఆంజనేయ స్వామి వేషంతో ఫైట్ మొదలవ్వగానే చలివేసేది కాదు. కానీ షూట్ గ్యాప్ ఇవ్వగానే మళ్ళీ చలి వేసేది. షాట్ గ్యాప్ లో వెంటనే వేడివేడి రగ్గులు కప్పేవాళ్లు అని చెప్పుకొచ్చారు.

చలికాలంలో బట్టలు లేకుండా, ఫుల్ చలిలో చిరంజీవి ఫైట్ సీన్స్ చేసాడంటే సినిమా మీద ఎంత డెడికేషన్, అందుకే మెగాస్టార్ అయ్యారని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి అభినందిస్తున్నారు.

Also Read : Vijay Deverakonda : విజయదేవరకొండ బర్త్ డే స్పెషల్.. VD14 ఫస్ట్ లుక్ రిలీజ్.. విజయ్ బాడీ అదిరిందిగా.. పోస్టర్ వైరల్..