Megastar Chiranjeevi Vishwambhara Movie Hindi Rights Sold for Huge Price
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సోషియో ఫాంటసీ జానర్లో విశ్వంభర సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజయ్యాయి.
అయితే గ్లింప్స్ లో గ్రాఫిక్స్ పై విమర్శలు రావడంతో మూవీ టీమ్ సినిమాలోని గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. తాజాగా ఈ సినిమాపై ఓ రూమర్ వినిపిస్తుంది. ఇటీవల టాలీవుడ్ సినిమాలకు హిందీ మార్కెట్ లో మంచి గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే. విశ్వంభర సోషియో ఫాంటసీ అని తెలియడంతో ఈ సినిమా హిందీ రైట్స్ కు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
Also Read : Raviteja Son : త్రివిక్రమ్ కొడుకుతో పాటు రవితేజ కొడుకు కూడా.. సందీప్ రెడ్డి వంగ కోసం.. రవితేజ లాగే..
చిరంజీవి విశ్వంభర సినిమా హిందీ రైట్స్ 38 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అధికారికంగా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఇదే కనక నిజమైతే మెగాస్టార్ కెరీర్ లోనే హిందీ రైట్స్ కి భారీ రేట్ ఇదే. దీంతో తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక సినిమాని సమ్మర్ కి తీసుకురావాలని మూవీ యూనిట్ భావిస్తుంది. మరి విశ్వంభర సినిమాతో మెగాస్టార్ ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.
ఈ సినిమాలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా మరికొంతమంది హీరోయిన్స్ చిరంజీవి చెల్లెలి పాత్రల్లో నటిస్తున్నారు. చిరంజీవి విశ్వంభర సినిమా తర్వాత అనిల్ రావిపూడితో కామెడీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మాస్ సినిమా చేయబోతున్నారు.
Also Read : Sivangi Teaser : ‘శివంగి’ టీజర్ చూశారా.. వంగేవాళ్ళు ఉన్నంత వరకు..మింగేవాళ్ళు ఉంటారు.. ఆనంది మాస్..