Vishwambhara : చిరంజీవి కెరీర్లోనే ఫస్ట్ టైం.. ఒక్క ఫైట్ కోసం ఏకంగా అన్ని రోజులు.. ‘విశ్వంభర’ ప్లానింగ్ మాములుగా లేదుగా..

ఇటీవల విశ్వంభర సినిమా షూట్ హైదరాబాద్ వెలుపల ముచ్చింతల్ వద్ద 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహం సెటప్ వేసి చేశారు.

Vishwambhara Action Scene : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. విశ్వంభర సినిమాని వచ్చే సంక్రాంతికి 10 జనవరి 2025న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు. దీంతో శరవేగంగా విశ్వంభర షూట్ జరుగుతుంది.

ఇటీవల విశ్వంభర సినిమా షూట్ హైదరాబాద్ వెలుపల ముచ్చింతల్ వద్ద 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహం సెటప్ వేసి చేశారు. ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ షూట్ చేసినట్టు దర్శకుడు తెలిపాడు. ఆ షూట్ నుంచి చిరంజీవి, త్రిష లుక్స్, ఆంజనేయస్వామి విగ్రహం ఫోటోలు బయటకి రావడంతో అవి వైరల్ గా మారాయి. అయితే మన దగ్గర తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద ఫైట్ అయినా మహా అయితే వారం లేదా పది రోజుల్లో తీసేస్తారు. కానీ విశ్వంభర ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కి ఏకంగా 26 రోజులు పట్టింది.

Also Read : Sabari Song : తల్లీ కూతుళ్ళ ఎమోషనల్ సాంగ్ విన్నారా? వరలక్ష్మి ‘శబరి’ నుంచి సాంగ్ రిలీజ్..

గత 26 రోజులుగా అక్కడ విశ్వంభర ఇంటర్వెల్ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్నారు. మొన్న ఏప్రిల్ 21తో ఈ షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. చిరంజీవి కెరీర్లోనే ఒక్క యాక్షన్ సీన్ కోసం 26 రోజులు షూట్ చేయడం ఇదే మొదటిసారి అని సమాచారం. దీంతో టాలీవుడ్ లో, అభిమానుల్లో విశ్వంభర ఇంటర్వెల్ యాక్షన్ సీన్ చర్చగా మారింది. సినిమాకి ఇదే మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఇక ఆ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆర్ట్ డైరెక్టర్ AS ప్రకాష్ దగ్గరుండి చేయించగా రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ చాలా పవర్ ఫుల్ గా ఈ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట. ఇంత కష్టపడుతున్నారంటే ఏ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడో, ఎంత క్లారిటీతో అవుట్ పుట్ ఇస్తాడో వశిష్ట అని అంతా చర్చించుకుంటున్నారు. మెగా అభిమానులుఅయితే ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఒక్క ఇంటర్వెల్ యాక్షన్ సీన్ భారీగా ఉంటుంది అంటే సినిమాని ఇంకే రేంజ్ లో ప్లాన్ చేశారో అని అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు