Megastar Chiranjevi Vs Super Star Rajinikanth Clash at Theaters in August with Bhola Shankar and Jailer Movies
Rajinikanth Vs Chiranjeevi : ఒకరు మెగాస్టార్(Megastar) అయితే మరొకరు సూపర్ స్టార్(Super Star). ఒకరు తెలుగులో పెద్దన్న అయితే మరొకరు తమిళ్ లో. ఒకరు 70కి దగ్గర్లో ఉన్న చిరంజీవి, మరొకరు 70 దాటేసిన రజనీకాంత్. సీనియర్ హీరోలైనా ఈ ఇద్దరి స్పీడ్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు. ఈ లేట్ వయసులో కూడా సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ రిలీజ్ విషయంలో కూడా అదే రేంజ్ పోటీపడుతున్నారు. ఒక వైపు మెగాస్టార్ తన సినిమాకు సంబందించి ప్రమోషన్లు మొదలుపెడుతుంటే రజనీకాంత్ నా సినిమా షూట్ అయిపోయింది ఇక ప్రమోషన్ల రంగంలోకి దిగడమే లేటంటున్నారు.
చిరంజీవి తన అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ ప్రమోషన్లు మొదలుపెట్టారు. లేటెస్ట్ గా సాంగ్ తో భోళా మానియా స్టార్ట్ చేశారు మెగాస్టార్. మెహర్ రమేష్ డైరెక్షన్లో రెండేళ్ల క్రితమే సినిమా మొదలుపెట్టినా గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేశారు చిరంజీవి. వాల్తేరు వీరయ్య రిలీజ్ తర్వాత ఫుల్ గా భోళాని స్పీడప్ చేసిన మెగాస్టార్ ఇండిపెండెన్స్ డేకి నాలుగు రోజుల ముందు ఆగస్ట్ 11న సినిమా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. దీనికి సంబందించి మ్యాగ్జిమమ్ షూట్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ లేటెస్ట్ గా సాంగ్ తో సినిమాకి కావల్సిన హైప్ తెప్పించేశారు.
మరో వైపు తమిళ్ సీనియర్ హీరో అయిన రజనీకాంత్ కూడా స్పీడ్ తగ్గించడం లేదు. వన్ బై వన్ సినిమాలు చేస్తూ కెరీర్ లో యమా స్పీడ్ మీదున్నారు. ప్రజెంట్ నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న భారీ మూవీ జైలర్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు. తమన్నాహీరోయిన్ గా శివరాజ్ కుమార్, మోహన్ లాల్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా.. లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న జైలర్ లేటెస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రజనీకాంత్ జైలర్ మూవీ ఆగస్ట్ 10న ధియేటర్లోకొస్తోంది.
Adipurush : రిలీజ్ కి ముందే ఆదిపురుష్ 400 కోట్ల బిజినెస్ చేసేసిందిగా.. ఈ లెక్కన చూస్తే కలెక్షన్స్..
దీంతో ఒక్క రోజు గ్యాప్ తో ఈ స్టార్ హీరోలిద్దరూ పోటీపడబోతున్నారు. ఈ ఏజ్ లో సినిమాల విషయంలోనే కాదు ఇలా రిలీజ్ విషయంలో కూడా సీనియర్ హీరోలు పోటీపడుతూ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్నారు.