Chiranjeevi : మాట నిలబెట్టుకున్న నాగబాబు.. మెగాస్టార్ ని కలిసాక ఆ పెద్దాయన సంతోషం చూడండి.. ఇక చనిపోయినా పర్లేదు..

ఆయన చిరంజీవికి చాలా పెద్ద అభిమాని అని ఎన్నో మార్లు చెప్పాడు.(Chiranjeevi)

Chiranjeevi : మాట నిలబెట్టుకున్న నాగబాబు.. మెగాస్టార్ ని కలిసాక ఆ పెద్దాయన సంతోషం చూడండి.. ఇక చనిపోయినా పర్లేదు..

Chiranjeevi Meet Mega Fan

Updated On : November 8, 2025 / 8:08 AM IST

Chiranjeevi : ఇటీవల కొన్ని రోజుల క్రితం తిరుపతికి చెందిన మురళి అనే ఓ పెద్దాయన తాను చేసిన చిరంజీవి పాటల డ్యాన్స్ లతో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో మురళి ఢీ షోలో కూడా కనిపించారు. ఓ దీపావళి ఈవెంట్లో మురళి స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసాడు. ఆయన చిరంజీవికి చాలా పెద్ద అభిమాని అని ఎన్నో మార్లు చెప్పాడు.(Chiranjeevi)

అయితే ఆ దీపావళి ఈవెంట్ కి నాగబాబు గెస్ట్ గా వచ్చి మురళి డ్యాన్స్ కి ఫిదా అవ్వడంతో ఆయన చిరకాల చిరంజీవిని కలవడం నెరవేరుస్తాను అని, ఆయనతో కూర్చోబెట్టి మాట్లాడిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాట కే మురళి ఎమోషనల్ అయ్యాడు. తాజాగా నాగబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మన శంకర వరప్రసాద్ గారు షూటింగ్ సమయంలో మురళిని మెగాస్టార్ చిరంజీవికి కలిపించారు.

Also See : Samantha : సమంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసిన సామ్..

రీసెంట్ గా ఢీ షోలో మురళి చిరంజీవి గారిని కలిసిన విషయం చెప్పి ఆ విజువల్స్ కొన్ని చూపించారు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవిని కలిసిన మురళి.. మీరు లేనిదే నేను లేను సర్. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత తొందరగా కలుస్తాను అనుకోలేదు. ఇక చనిపోయిన పర్లేదు అంటూ ఢీ స్టేజిపై ఎమోషనల్ అయ్యారు.

అయితే మెగాస్టార్ చిరంజీవి.. ఏదో ఒకరోజు నా సినిమాలో నా పక్కన డ్యాన్స్ వేస్తావు అని మాట ఇచ్చినట్టు హైపర్ ఆది చెప్పాడు. దీంతో ఆ మెగా అభిమాని సంతోషం మరింత రెట్టింపు అయింది. ఈ విషయం తెలిసి మరోసారి అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్ ని, మురళిని చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లిన నాగబాబుని అభినందిస్తున్నారు.

Also Read : Diés Iraé Review : ‘డీయస్ ఈరే’ మూవీ రివ్యూ.. మోహన్ లాల్ కొడుకు సినిమా.. ఒంటరిగా చూస్తే ప్యాంట్ తడిచిపోతుంది అంతే..

మీరు కూడా ఢీ షో ప్రోమో చూసేయండి..