Chiranjeevi : బప్పి లహరి మరణంపై మెగాస్టార్ ట్వీట్

మెగాస్టార్ చిరంజీవి బప్పి లహిరి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బప్పి లహరితో దిగిన ఫోటోని షేర్ చేసి.. ''బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. అతను నా కోసం అనేక.....

Chiranjeevi :  బప్పి లహరి మరణంపై మెగాస్టార్ ట్వీట్

Chiru

Updated On : February 16, 2022 / 11:09 AM IST

Bappi Lahiri :  ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి మంగళవారం రాత్రి కన్నుమూశారు. బాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గానే కాక సింగర్ గా కూడా సక్సెస్ సాధించారు. తెలుగులో కూడా చాలా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని క్రిటీ కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ బప్పి లహిరి 69 ఏళ్ల వయసులో మరణించారు. బప్పి లహరి మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Sandhya Mukherjee : ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత

మెగాస్టార్ చిరంజీవి బప్పి లహిరి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బప్పి లహరితో దిగిన ఫోటోని షేర్ చేసి.. ”బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్‌ సాంగ్ లను అందించారు. అతను అందించిన సాంగ్స్ నా సినిమాల సక్సెస్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అతని సంగీతంలో ప్రతిబింబించే అతని ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల అతని ఉత్సాహం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులు మరియు ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.