Sandhya Mukherjee : ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ గాయని, బంగ బిభూషణ్‌ అవార్డు గ్రహీత సంధ్యా ముఖర్జీ 91 ఏళ్ళ వయసులో మరణించారు. కోల్‌కతాలో గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న...

Sandhya Mukherjee : ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత

Sandhya Mukherjee

Updated On : February 16, 2022 / 10:12 AM IST

Sandhya Mukherjee :   ఇటీవల కరోనాతో లేదా వేరే ఆరోగ్య సమస్యలతో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు. వారి మరణం సినీ పరిశ్రమకి తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. ఇటీవలే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణించారు. ఆమె మరణ వార్తని జీర్ణించుకోకముందే తాజాగా మంగళవారం రాత్రి బాలీవుడ్ ఫేమస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కన్నుమూశారు. ఇదే రోజు మరో ప్రముఖ బెంగాలీ గాయని కూడా మరణించారు.

ప్రముఖ బెంగాలీ గాయని, బంగ బిభూషణ్‌ అవార్డు గ్రహీత సంధ్యా ముఖర్జీ 91 ఏళ్ళ వయసులో మరణించారు. కోల్‌కతాలో గత కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంధ్యా ముఖర్జీ మంగళవారం రాత్రి 7.30 గంటలకు మృతి చెందారు.

Bappi Lahiri: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి కన్నుమూత

హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు పాడారు సంధ్యా ముఖర్జీ. ఇటీవలే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుని ప్రకటించగా ఈమె దాన్ని తిరస్కరించింది. దాదాపు 20 దశాబ్దాలకు పైగా ఆమె పాటలతో బెంగాలీ ప్రజలని మైమరిపించారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా, పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.