Bholaa Shankar : అరసవల్లి సూర్య దేవాలయంలో మెహర్ రమేష్ ప్రత్యేక పూజలు.. రీమేక్ సెంటిమెంట్ పై మెగా ఫ్యాన్స్ నమ్మకం..

భోళా శంకర్ సినిమా ఆగష్టు 11న రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా దర్శకుడు మెహర్ రమేష్ అరసవల్లి సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

Bholaa Shankar : అరసవల్లి సూర్య దేవాలయంలో మెహర్ రమేష్ ప్రత్యేక పూజలు.. రీమేక్ సెంటిమెంట్ పై మెగా ఫ్యాన్స్ నమ్మకం..

Meher Ramesh Special Pooja for Chiranjeevi Bholaa Shankar hit

Updated On : July 10, 2023 / 6:09 PM IST

Bholaa Shankar : చిరంజీవి (Chiranjeevi), త‌మ‌న్నా (Tamannaah), కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఆగష్టు 11న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని మెహర్ రమేష్ శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్య భగవానున్ని దర్శించుకున్నాడు.

Bro : బ్రో సినిమాలో కొత్త పవన్‌ని చూస్తారు.. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. థమన్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన మెహర్ రమేష్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. “మెగా అభిమానులకు భోళా శంకర్ ఒక ఫుల్ మీల్స్ లా కడుపు నింపుతుంది. ఈ మూవీలో చిరంజీవిలోని కొత్త కోణం చూస్తారు. సినిమా మొత్తం పూర్తి అయ్యింది. సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకున్నాను” అంటూ తెలియజేశాడు. కాగా మెహర్ రమేష్ దాదాపు 10 ఏళ్ళ విరామం తరువాత ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా భోళా శంకర్ ని తెరకెక్కించాడు.

Game Changer : రామ్ చరణ్ బ్యాక్ టు షూట్..! గేమ్ చెంజర్ కొత్త షెడ్యూల్ షురూ..


2013 లో వెంకటేష్ తో తెరకెక్కించిన షాడో ప్లాప్ అవ్వడం, అంతకుముందు తీసిన శక్తి కూడా పరాజయం పాలైంది. ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తూ భోళా శంకర్ చేస్తున్నాడు. అయితే ఈ దర్శకుడికి రీమేక్స్ తెరకెక్కించడంలో మంచి మార్కులే పడ్డాయి. కన్నడలో ఆంధ్రావాలా, ఒక్కడు రీమేక్స్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక ఇక్కడ బిల్లా కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు భోళా శంకర్ కూడా రీమేక్ అవ్వడంతో హిట్టు కొడతాడు అనే నమ్మకంతో మెగా అభిమానులు ఉన్నారు. మరి మెహర్ ఫ్యాన్స్ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.