Messsi : ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’.. మలయాళం సినిమా తెలుగులోకి..
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.(Messsi)
Messsi
Messsi : మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇటీవల తెలుగులో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో 2022 లో రిలీజయిన ఆణాపరంబిల్ వరల్డ్ కప్ అనే సినిమా తెలుగులో మెస్సి టైటిల్ తో రానుంది. తెలుగులో ఈ సినిమాని ధామా టేల్స్ బ్యానర్ పై ఆకర్ష ఆలపాటి రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్ మెయిన్ లీడ్ లో నటించగా జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్.. పలువురు కీలకపాత్రల్లో నటించారు.
తాజాగా వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ఫస్ట్ లుక్, టైటిల్ స్కూల్ పిల్లల చేతుల మీదుగా రిలీజ్ చేసారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also See : Kushitha Kallapu : నటి కుషిత కళ్లపు వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ.. నా చిన్నతనం నుండి క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటాను. చిన్న వారిని బాగా ప్రోత్సహించాలని అనుకున్నాను. ఈ క్రమంలో మలయాళ సినిమాను మెస్సిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాను. ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము. పీవీఆర్ ఉదయ్, వెంకట్ మాకు మంచి సపోర్ట్ అందించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీన మెస్సి సినిమాని రిలీజ్ చేయబోతున్నాము అని తెలిపారు.
