Michael Gambon : సినీ పరిశ్రమలో విషాదం.. హ్యారీ పోటర్ నటుడు సర్ మైఖేల్ గాంబోన్ కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ సర్ మైఖేల్ గాంబోన్ (Michael Gambon) కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు.

Michael Gambon Passed away
Michael Gambon Passed away : చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ సర్ మైఖేల్ గాంబోన్ (Michael Gambon) కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హ్యారీ పోటర్ సిరీస్‌లో దాదాపు ఆరింటిలో ఆయన నటించారు. హాగ్వార్ట్స్ హెడ్‌మాస్టర్ ఆల్బస్ డంబుల్‌డోర్ పాత్రలో ఆయన నటనతో ప్రేక్షకుల మనస్సులో చెదరని ముద్ర వేశాడు.
“సర్ మైఖేల్ గాంబోన్‌ను ఇక లేరు అని చెప్పాలంటేనే ఎంతో బాధగా ఉంది. భార్య అన్నే, కుమారుడు ఫెర్గస్‌లు ఆస్పత్రిలో మైఖేల్ బెడ్ వద్ద ఉండగానే అతడు ప్రశాంతంగా మరణించాడు.” అని అతని కుటుంబం తెలిపింది. ఈ నటుడి మరణవార్త ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
Rest in peace Michael Gambon. A truly iconic actor who I have enjoyed in the likes of Layer Cake, Sleepy Hollow and Kingsmen: The Golden Circle.#RIPMichaelGambon pic.twitter.com/8yBlKlIPM9
— Andy ????????????? (@Andy121019) September 28, 2023
19 అక్టోబర్ 1940లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించాడు మైఖేల్ గాంబోన్. లండన్‌లో పెరిగాడు. తన తండ్రి అడుగుజాడల్లో ఇంజనీర్‌గా శిక్షణ పొందాడు. ఆ తరువాత నాటక రంగంలో నుంచి సినిమాల్లోకి వచ్చారు. 1998లో నాటక రంగానికి అందించిన సేవలకు గాంబోన్‌కు నైట్ బిరుదును ప్రధానం చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగారు. “గోస్ఫోర్డ్ పార్క్” నుండి “ది కింగ్స్ స్పీచ్, యానిమేటెడ్ ఫ్యామిలీ మూవీ “పాడింగ్టన్” వరకు డజన్ల కొద్దీ చిత్రాలలో నటించాడు.
Amitabh Bachchan : ‘పాపం పసివాడు’కు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ అండ..
జాన్ డెక్స్టర్ దర్శకత్వం వహించిన “లైఫ్ ఆఫ్ గెలీలియో”లో గాంబోన్ నటనకు గాను విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మూడు ఆలివర్ అవార్డులు, రెండు స్క్రీన్ యాక్టర్ అవార్డులతో పాటు నాలుగు బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) అవార్డులను ఆయన అందుకున్నారు. వయోభారం కారణంగా 2015 నుంచి ఆయన సినిమాకు దూరంగా ఉంటున్నారు.