81 ఏళ్ల ఉష సోమన్ చేసిన ఫీట్స్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
ఈరోజుల్లో ముప్ఫై పైబడితే చాలు.. కొంచెం సేపు నడవడానికో, మెట్లెక్కడానికో ఆపసోపాలు పడిపోతుంటారు. అలాంటివాళ్లకు సవాలు విసురుతూ ఓ బామ్మ చేసిన ఫీట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 81 ఏళ్ల వయసున్న బామ్మ ఒంటి కాలిపై గెంతడమే కాకుండా చీరలోనూ పుష్-అప్స్, లాంగ్‌రన్‌లు చేసి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాటను నిజం చేశారు. ఇంతకీ ఈ బామ్మ గారు ఎవరంటే.. మన టాప్ ఇండియన్ మోడల్, ఫిట్‌నెస్ ఫ్రీక్ మిలింద్ సోమన్ తల్లి ఉష సోమన్.
మిలింద్ భార్య అంకితా కొన్వర్‌తో కలిసి ఆమె ఒంటి కాలితో బాక్స్ జంప్స్ చేయడమే కాకుండా కొడుకుతో సమానంగా పుష్-అప్స్, వర్కఅవుట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంకిత తన అత్తగారితో కలిసి బాక్స్ జంప్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘మీరు చాలా మందికి ఆదర్శం. ఒకవేళ నేను 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మీలా ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.
It’s never too late.
Usha Soman, my mother.
80 years young.#mothersday #love #mom #momgoals #fitwomen4fitfamilies #fitness #fitnessmotivation #healthylifestyle #fitterin2019 #livetoinspire make every day mother’s day!!!!! ??? pic.twitter.com/7aPS0cWxlR
— Milind Usha Soman (@milindrunning) May 12, 2019
అంతేకాదు ఉష సోమన్ తన కొడుకు మిలింద్‌తో కలిసి చీరలో పుష్-అప్‌లు చేస్తున్న వీడియో కూడా గతంలో వైరల్ అయ్యింది. ఇటీవల ఉష, తన కొడుకు మలింద్‌కు పోటీగా ఒకేసారి 16 పుష్-అప్‌లు చేసిన వీడియోతో పాటు 2016లో మహరాష్ట్రలోని నిర్వహించిన ఓ మరథాన్‌లో తనతో పాటు ఆయన తల్లి కూడా పాల్గొన్న వీడియోను ఉమెన్స్ డే సందర్భంగా షేర్ చేశాడు. ఈ వయసులో కూడా ఆరోగ్యవంతమైన ఫిట్‌నెస్‌తో యువతతో పాటు వృద్ధులకు కూడా సవాలు విసురుతూనే ఆదర్శంగా నిలిచిన తన తల్లి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను తరచూ మిలింద్ సోషల్ మీడియాలో పంచుకుంటుంటాడు.
Read Also : సోనాక్షికి శక్తిమాన్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇన్‌డైరెక్ట్‌గా ఇంకొందరిపై..