Allu Arjun : మంత్రి తలసాని చేతులు మీదుగా బన్నీ మల్టీప్లెక్స్ ఓపెన్.. థియేటర్‌లో ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
అల్లు అర్జున్ అండ్ ఆసియన్ సినిమాస్ కలిసి AAA సినిమాస్ పేరిట ఆసియన్ సత్యం మాల్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ మాల్ ఓపెనింగ్ ఈ నెల..

Allu Arjun AAA Cinemas will be launch by Talasani Srinivas Yadav
Allu Arjun – AAA Cinemas : ప్రస్తుతం భారతదేశంలో మల్టీప్లెక్స్ కల్చర్ కొంచెం కొంచెంగా పెరుగుతూ పోతుంది. ఇక ఈ మల్టీప్లెక్స్ చైన్ లో ఆసియన్ సినిమాస్ (Asian Cinemas) శరవేగంగా ఎదుగుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) కలిసి AMB సినిమాస్ ని మొదలుపెట్టి సిటీలోనే బెస్ట్ మల్టీప్లెక్స్ గా నిలిపారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ లో మరో మల్టీప్లెక్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు.
ALLU family: అమరావతిలో అల్లు ఫ్యామిలీ
హైదరాబాద్ సత్యం థియేటర్ అంటే సినీ పరిశ్రమలో తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆ థియేటర్ స్థానంలోనే అల్లు అర్జున్ అండ్ ఆసియన్ సినిమాస్ కలిసి AAA సినిమాస్ పేరిట ఆసియన్ సత్యం మాల్ ని లాంచ్ చేయబోతున్నారు. ఈ మాల్ ఓపెనింగ్ ఈ నెల (జూన్) 15న జరగబోతుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), అల్లు అర్జున్ ఈ మాల్ ని ప్రారభించబోతున్నారు. అంతకంటే ముందు జూన్ 14 పూజా కార్యక్రమం జరగనుంది.
Allu Arjun : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంపై బన్నీ కామెంట్.. మా నాన్న ముందే చెప్పాడంటూ..
ఇక ఈ AAA సినిమాస్ ప్రత్యేకతలు ఏంటంటే.. మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి. మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటే, సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. అలాగే మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి. ఇక ఆసియన్ సత్యం మాల్ లో పాపులర్ ఫుడ్ బ్రాండ్స్ తో బిగ్ ఫుడ్ కోర్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. సిటీ మధ్యలోని అమీర్ పెట్ లో ఈ మాల్ వస్తుండడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun AAA Cinemas will be launch by Talasani Srinivas Yadav