ALLU family: అమరావతిలో అల్లు ఫ్యామిలీ
కష్టాల్లో ఉన్న అభిమానులకు తాము ఉన్నామంటూ అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఓ అభిమాని తల్లి మరణించడంతో పరామర్శించేందుకు అమరావతి నగరానికి అల్లు ఫ్యామిలీ వచ్చారు.

ALLU family
ALLU family-Allu Arjun: కష్టాల్లో ఉన్న అభిమానులకు తాము ఉన్నామంటూ అండగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఓ అభిమాని తల్లి మరణించడంతో పరామర్శించేందుకు అమరావతి నగరానికి అల్లు ఫ్యామిలీ వచ్చారు. శైలజ థియేటర్ నిర్వాహకుడు బాబీ తల్లి ఇటీవల చనిపోయింది. ఆమె సంస్మరణ కార్యక్రమంలో అల్లు అర్జున్(Allu Arjun), అల్లు శిరీష్(Allu Sirish), అల్లు అరవింద్(Allu Aravind) లు పాల్గొన్నారు. బన్నీకి చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. కొద్దిసేపు బంధువులతో, పుర ప్రముఖులతో అల్లు అరవింద్, బన్నీ ముచ్చటించారు.
Allu Arjun : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంపై బన్నీ కామెంట్.. మా నాన్న ముందే చెప్పాడంటూ..
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే పుష్ప 2 నుంచి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్‌లు అభిమానులను అలరించాయి. వైజాగ్, రామోజీ ఫిలింసిటీ, మారేడుమిల్లి అడవుల్లో సినిమా షూటింగ్ జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాకాలు చేస్తోంది.
Allu Arjun : బన్నీని మరొకరి ప్రేమలో పడేలా చేసిన స్నేహారెడ్డి.. ఎవరి ప్రేమలో పడ్డాడో తెలుసా?