Mirai Song
Mirai Song : ఇటీవల టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది. సినిమా నుంచి ముందే రిలీజయి హిట్ అయిన సాంగ్స్ సినిమాలో కనిపించడం లేదు. దేవర, గేమ్ ఛేంజర్, కింగ్డమ్, కుబేర.. ఇలా గత కొన్నాళ్లుగా ఆయా సినిమాల నుంచి రిలీజ్ కి ముందు వచ్చి హిట్ అయిన సాంగ్స్ తీరా థియేటర్ కి వెళ్లి చూస్తే సినిమాల్లో ఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన మిరాయ్ సినిమా కూడా అదే పద్ధతి ఫాలో అయింది.(Mirai Song)
తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ సినిమా నేడు రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు ఈ సినిమా నుంచి ‘వైబ్ ఉంది బేబీ..’ అనే సాంగ్ వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ బాగా వినపడింది, సోషల్ మీడియాలో రీల్స్ బాగా చేసారు ఆ పాటకు. కానీ థియేటర్ కి వెళ్లి చూస్తే సినిమాలో ఆ పాట లేకపోవడం గమనార్హం.
Also Read : Mirai Review : ‘మిరాయ్’ మూవీ రివ్యూ.. మరో విజువల్ వండర్‌తో తేజ సజ్జా
అయితే మిరాయ్ సినిమాలో సాంగ్ కోసం ప్లేసెమెంట్ ఉన్నా, సన్నివేశం వచ్చినా ఎడిటింగ్ లో తీసేసారు అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ రితిక నాయక్ ఒక సాధ్వి. సాధ్వితో ఇలాంటి సాంగ్ పెడితే బాగోదు అని పెట్టినట్టు లేరు. చివర్లో కూడా డివోషనల్ టచ్ తో ఎండ్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ సాంగ్ వేస్తే డైవర్ట్ అవుతుందని ఎండ్ టైటిల్స్ లో కూడా వేయలేదు. మొత్తానికి ఈ సాంగ్ సినిమాలో లేకపోయినా ప్రమోషన్స్ కి బాగానే పనికొచ్చింది.
సినిమాలో మిస్ అయిన సాంగ్ ఇక్కడ చూసేయండి..
Also Read : Anushka Shetty : అసలే జనాలకు దూరం.. ‘ఘాటీ’ ఫ్లాప్ తర్వాత అనుష్క డెషిషన్ తో నిరాశలో ఫ్యాన్స్..