Miss Shetty Mr Polishetty
Miss Shetty Mr Polishetty OTT Update : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) లు కలిసి నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్షన్‌లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నేడు (గురువారం సెప్టెంబర్ 7)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ చిత్రంలో నవీన్ కామెడీ టైమింగ్, డెలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయని సినిమా చూసిన వారు చెబుతున్నారు. చాలా రోజుల తరువాత అనుష్కను ఇలా తెరపై చూడడం ఆనందంగా ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. ఇక స్ట్రీమింగ్ ఎప్పుడు కానుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Jawan OTT : జవాన్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్ ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన తరువాతే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. కాగా.. అక్టోబర్ రెండవ వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సదరు వార్తల సారాంశం. అయితే.. దీనిపై ఇప్పటి వరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కథ ఏంటంటే..?
సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ స్టాండప్ కమెడియన్ గా ఎదగాలని ట్రై చేస్తుంటాడు హీరో. ఇంటర్నేషనల్ చెఫ్ గా ఉన్న హీరోయిన్ తన తల్లి చివరి రోజులని ఇండియాలో గడపడానికి వస్తుంది. చిన్నప్పట్నుంచి తండ్రి లేకుండా తల్లితో బతకడంతో తాను కూడా పెళ్లి వద్దు కానీ ఓ బిడ్డకు అమ్మ అవ్వాలి అని అనుకుంటుంది. దీని కోసం స్పెర్మ్ డొనేట్ చేయడానికి ఒక మంచి అబ్బాయిని వెతుకుతున్న ప్రాసెస్ లో నవీన్ ని కలుస్తుంది. తన గురించి తెలుసుకోవడానికి అతనితో ట్రావెల్ చేస్తూ అతని కెరీర్ కి కూడా ఉపయోగపడుతుంది. కానీ హీరో ఇదంతా ప్రేమ అనుకోని ప్రపోజ్ చేసే టైంకి హీరోయిన్ షాక్ ఇచ్చి నిజం చెప్తుంది. మరి హీరో స్పెర్మ్ డొనేట్ చేశాడా? హీరో ప్రేమ ఏమైంది? హీరోయిన్ తల్లి చనిపోయాక మళ్ళీ విదేశాలకు వెళ్లిపోయిందా? హీరోయిన్ తల్లి అయ్యిందా? నవీన్ స్టాండప్ కమెడియన్ అయ్యాడా అనేది తెరపై చూడాల్సిందే.
Mahesh – Pawan : అప్పుడు పవన్ కోసం మహేష్.. ఇప్పుడు మహేష్ కోసం పవన్.. నిజమేనా..?