Jawan OTT : జ‌వాన్ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) న‌టించిన సినిమా ‘జ‌వాన్’ (Jawan). త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌.

Jawan OTT : జ‌వాన్ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌..!  స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Jawan OTT update

Updated On : September 7, 2023 / 5:56 PM IST

Jawan OTT update : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) న‌టించిన సినిమా ‘జ‌వాన్’ (Jawan). త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ (Atlee) డైరెక్ష‌న్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌. దీపికా పదుకొణె, ప్రియమణి, అమృత అయ్యర్, సన్యా మల్హోత్రా లు కీల‌క పాత్ర‌లు పోషించారు. విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించ‌గా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఈ సినిమా నేడు(గురువారం సెప్టెంబ‌ర్ 7)న ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండకు తమిళనాడులో ఇంతటి క్రేజ్ ఉందా..? ఈ ఏడాది రికార్డు..

సోష‌ల్ మీడియాలో ఈ చిత్రానికి మంచి రివ్యూలు వ‌స్తున్నాయి. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్ర డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. భారీ పోటీ మ‌ధ్య దాదాపు రూ.120 కోట్ల‌కు ఓటీటీ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. తెలుగు వెర్ష‌న్ శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు సొంతం చేసుకుంది.

Shah Rukh Khan : కథ నచ్చి కాదు.. మరో కారణంతో ‘జవాన్’ని షారుఖ్ ఒకే చేశాడట..

ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైన 50 రోజుల త‌రువాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాల‌నే ఒప్పందం ఉంద‌ట‌. అంటే..అక్టోబ‌ర్ చివ‌రి వారంలో లేదంటే న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతోనే డైరెక్ట‌ర్‌గా అట్లీ, హీరోయిన్‌గా న‌య‌న‌తార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.