Mohan Babu: మంచు మోహన్ బాబుకు బిగ్‌షాక్.. యూనివర్సిటీకి భారీ జరిమానా.. ఆ మొత్తం చెల్లించాల్సిందే..

Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీకి భారీ జరిమానా పడింది.

Mohan Babu: మంచు మోహన్ బాబుకు బిగ్‌షాక్.. యూనివర్సిటీకి భారీ జరిమానా.. ఆ మొత్తం చెల్లించాల్సిందే..

Manchu Mohan Babu

Updated On : October 8, 2025 / 7:50 AM IST

Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీకి భారీ జరిమానా పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ యూనివర్శిటీకి భారీ జరిమానా విధించింది.

2022 -23 నుంచి గతేడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు అంటే.. మూడేళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్శిటీ అదనంగా సుమారు రూ.26కోట్ల వసూళ్లు చేశారని, అదేవిధంగా ఫీజు రీయింబర్స్ మెంట్‌లోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తేల్చింది.

విచారణ అనంతరం ఉన్నత విద్యా కమిషన్ యూనివర్శిటీ యాజమాన్యంకు రూ.15లక్షలు జరిమానా విధించారు. అదేవిధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26కోట్లు 15రోజుల్లో చెల్లించాలని విద్యా కమిషన్ యూనివర్శిటీ యాజమాన్యంకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: AP Pension : ఏపీలో పెన్షనర్లకు అలర్ట్.. పెన్షన్ రద్దైన, డబ్బులు ఆగిపోయిన వారికి గుడ్‌న్యూస్.. వెంటనే ఇలా చెయ్యండి! కొద్దిరోజులు మాత్రమే..

గత ఏడాది పేరెంట్స్ అసోసియేషన్ నుంచి మోహన్ బాబు యూనివర్శిటీకి వ్యతిరేకంగా ఉన్నత విద్యామండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ముఖ్యమంత్రి కార్యాలయంకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఆ ఫిర్యాదులపై సుదీర్ఘ విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యామండలి.. మోహన్ బాబు యూనివర్శిటీపై వచ్చిన ఆరోపణలు అంతా నిజమేనని నిర్ధారణ చేసింది.

అంతేకాదు.. ఆ విశ్వవిద్యాలయం అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్‌సీఏహెచ్‌పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సెల్ కు సిఫార్సు చేసింది.

తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ 2022లో మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్శిటీగా మారింది. అప్పటి వరకు శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70శాతం, ఆ తరువాత ప్రైవేట్ యూనివర్శిటీలో గ్రీన్‌ఫీల్డ్ కింద ప్రారంభించే కోర్సుల్లోని 35శాతం సీట్లను ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుంది. వీటికి ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుంది.

అయితే, యూనివర్శిటీలో అదనంగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తల్లిదండ్రుల అసోసియేషన్ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌తోపాటు విద్యాశాఖ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయంకు ఫిర్యాదులు చేసింది.