Mohan Babu Gets Anticipatory bail From Supreme Court
Mohan Babu : గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల మోహన్ బాబు ఇంటికి పలువురు జర్నలిస్టులు వెళ్లడంతో మోహన్ బాబు కోపం తెచ్చుకొని అనుకోకుండా ఓ జర్నలిస్ట్ పై దాడి చేసారు. దాంతో అతను హాస్పిటల్ పాలయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
ఈ కేసు వివాదంలో తాజాగా మోహన్ బాబు కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మోహన్ బాబు తరపు న్యాయవాది ఈ కేసు విచారణలో మాట్లాడుతూ.. దెబ్బ తగిలిన జర్నలిస్ట్ ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, లిఖితపూర్వకంగా క్షమాపణ కూడా చెప్పారు మోహన్ బాబు. తనకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రకటించారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, ఒక సెలబ్రెటీ గా ఉన్నారు. అలాంటి పని కావాలని చేయలేదు అని తెలిపారు.
Also Read : Prabhas : ‘ఫౌజీ’ షూట్ నుంచి ప్రభాస్ ఫోటోలు రివీల్ చేసిన బాలీవుడ్ స్టార్.. రెబల్ స్టార్ లుక్ అదిరిందిగా..
మోహన్ బాబు మంచు ఫ్యామిలీ వివాదం గురించి చెప్తూ.. వివాదం పూర్తిగా కుటుంబ వ్యవహారం, రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆస్తులు వ్యవహారంలో తన కొడుకుకి తనకు మధ్య ఉన్న కుటుంబ వివాదం తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రం సంబంధం లేదు. ఒక యూనివర్సిటీ, విద్యా సంస్థలకు సంబంధించి తప్ప మరేమీ లేదు అని తెలిపారు. అయితే దెబ్బలు తగిలిన జర్నలిస్ట్ ఎలా ఉన్నారని జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ అమానుల్లాహ్ ధర్మాసనం అడగడంతో జర్నలిస్ట్ తరపు న్యాయవాది పరిస్థితిని వివరించారు.
Also Read : Actor Chinna : ఈ నటుడు మాజీ సీఎం మేనల్లుడు అని తెలుసా? ఈయన నటుడు అయ్యాక సీఎం క్యాబినెట్ అందర్నీ పిలిచి..
అనంతరం.. మోహన్ బాబు విజ్ఞప్తి, వాదనలు పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక మంచు ఫ్యామిలీ వివాదం మాత్రం ఇంకా కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ పరిధిలో వీరి వివాదం నడుస్తుంది. మంచు మనోజ్ – మోహన్ బాబు ఒకరిపై ఒకరు రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ లో ఫిర్యాదు చేసారు. ఇప్పటికే ఓ సారి ఇద్దర్ని పిలిచి మాట్లాడారు. మరోసారి పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. మోహన్ బాబు ఆస్తుల గురించే అని, మనోజ్ దగ్గర ఉన్న తన ఆస్తులు తనకు ఇప్పించాలని కోరగా మనోజ్ మాత్రం ఇది యూనివర్సిటీ, విద్యార్థులు సమస్య అని, వాళ్లకు అన్యాయం చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు.