Diés Iraé Review
Diés Iraé Review : మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటించిన ‘డీయస్ ఈరే’ అనే హారర్ సినిమా మలయాళంలో అక్టోబర్ 31న రిలీజవ్వగా తెలుగులో నేడు నవంబర్ 7న రిలీజయింది. చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మాణంలో రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.Diés Iraé Review)
కథ విషయానికొస్తే.. రోహన్(ప్రణవ్ మోహన్ లాల్) బాగా డబ్బున్న వ్యక్తి కొడుకు. ఓ పెద్ద ఇంట్లో సింగిల్ గా ఉంటూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన స్కూల్ మేట్ కని(సుస్మిత భట్) చనిపోయింది అని తెలియడంతో రోహన్, అతని ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్లి పరామర్శిస్తారు. రోహన్ – కనికి గతంలో రిలేషన్ ఉండి, వాళ్లిద్దరూ ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. కని వాళ్ళింటికి వెళ్లిన రోహన్ అక్కడ్నుంచి కని హెయిర్ క్లిప్ ఒకటి తన ఇంటికి తీసుకొస్తాడు. అప్పట్నుంచి కని ఆత్మ రోహన్ ని వెంటాడుతుంది, కొడుతుంది, భయపెడుతుంది.
ఈ విషయం రోహన్ కని ఇంటి పక్కనే ఉండే మధు(గిబిన్ గోపినాథ్)కి చెప్తాడు. ఓ రోజు కని తమ్ముడు రోహన్ ఇంటికి వస్తే ఆ ఆత్మ అతన్ని మేడ మీద నుంచి కిందకు పడేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటనలతో అది కని ఆత్మ కాదు ఒక అబ్బాయి ఆత్మ అని అర్ధమవుతుంది. దీంతో రోహన్, మధు అసలు అది ఎవరి ఆత్మ, కని లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? కని రూమ్ లో కొన్ని వస్తువులు ఎలా మిస్ అయ్యాయి? అవి ఎక్కడికి వెళ్లాయి అని వెతకడం మొదలు పెడతారు. మరి రోహన్ ని ఇబ్బంది పెట్టె ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎందుకు రోహన్ ని ఇబ్బంది పెడుతుంది? కని ఎందుకు చనిపోయింది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Jatadhara Review : ‘జటాధర’ మూవీ రివ్యూ.. లంకె బిందెలకు కాపలా ఉన్న ధన పిశాచి..
రీసెంట్ టైమ్స్ లో మంచి ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. ఈ డీయస్ ఈరే సినిమా బెస్ట్ హారర్ సినిమాగా చెప్పొచ్చు. ఫస్ట్ 20 నిముషాలు సింపుల్ గా సాగిపోతుంది. రోహన్ కని హెయిర్ క్లిప్ తెచ్చిన దగ్గర్నుంచి అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ప్రతీ సీన్ తో భయపెడతారు. హారర్ మాత్రమే కాకుండా ఈ ఆత్మ ఎవరిది అనే ఇన్వెస్టిగేషన్ కూడా సస్పెన్స్ తో చాలా బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ నుంచి సినిమా ఇంకా ఆసక్తిగా మారుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది అని తెలిసిన తర్వాత అంతా ఆశ్చర్యపోతారు. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ ఒళ్ళు గగుర్పుడుస్తాయి.
ఓ పెద్ద ఇంట్లోనే సగం సినిమా భయంతో నడిపించారు. థియేటర్లో చూస్తేనే భయపడటం ఖాయం. ఇక ఒంటరిగా చూశారంటే అంతే. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. దాని వల్లే ఇంకా ఎక్కువగా భయపడతాం. అయితే అసలు కని ఎందుకు చనిపోయింది అని క్లారిటీ ఇవ్వలేదు. చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చారు కాబట్టి అందులో చెప్తారేమో చూడాలి. మలయాళం సినిమాలు అంటే బాగా సాగదీస్తారని తెలిసిందే. ఈ సినిమా నిడివి తక్కువైనా ఫస్ట్ హాఫ్ లో అక్కర్లేని సీన్స్ ని కూడా అక్కడ ఏదో ఉంది అని సస్పెన్స్ కోసం బాగా సాగదీసారు. అసలు ఆ ఆత్మ ఎవరిది అని ఒక ఆర్టిస్ట్ ని కూడా చూపించకుండా ఫోటో మాత్రమే చూపించి కథ నడిపించడం గమనార్హం. డీయస్ ఈరే అంటే తన కోపం చూపించే ఒక రోజు అని అర్ధం. ఇదొక లాటిన్ పదం. ఆత్మ తన కోపం చూపించింది అనే అర్థంలో ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టరేమో..
నటీనటుల పర్ఫార్మెన్స్.. ప్రణవ్ మోహన్ లాల్ భయపడే పాత్రలో అదరగొట్టాడు. మధు పాత్రలో నటించిన గిబి గోపినాథ్ కూడా మెప్పిస్తారు. జయ కురుప్ పాత్ర కూడా తన నటనతో అదరగొట్టింది. మిగిలిన మలయాళ నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు.
Also Read : Aaryan Review : ‘ఆర్యన్’ మూవీ రివ్యూ.. చనిపోయిన వ్యక్తి హత్యలు ఎలా చేస్తాడు? థ్రిల్లర్ సినిమా భలే ఉందే..
సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. సగం సినిమా నైట్ ఎఫెక్ట్ లో దానికి తగ్గ పర్ఫెక్ట్ లైటింగ్ తో, భయపెట్టే విధంగా కెమేరా షాట్స్ తో విజువల్ గా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఏం లేని చోట కూడా ఏదో ఉంది అనేలా మ్యూజిక్ తోనే భయపెట్టారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బాగా వర్క్ చేసింది ఈ సినిమాకు. ఒక సింపుల్ కథని తీసుకొని హారర్ సస్పెన్స్ కథాంశంతో చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ సినిమాని తీసినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘డీయస్ ఈరే’ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ హారర్ సినిమా అని చెప్పొచ్చు. భయపడాలంటే ఈ హారర్ సినిమా చూసేయండి. ఈ సినిమాకు 3.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.