Mohanlal Prithviraj Sukumaran L2 Empuraan Trailer Released
L2 Empuraan Trailer : మోహన్ లాల్ హీరోగా గతంలో వచ్చిన మలయాళ సినిమా లూసిఫర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాని చిరంజీవి తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసారు. ఇప్పుడు లూసిఫర్ సినిమాకు సీక్వెల్ ‘L2E: ఎంపురాన్’ అనే పేరుతో రాబోతుంది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘L2E: ఎంపురాన్’ మార్చి 27న పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు.
Also Read : Rajamouli : మహేష్ సినిమా షూటింగ్ లొకేషన్ వీడియో షేర్ చేసిన రాజమౌళి.. ట్రెక్కింగ్ చేసి పైకెక్కి..
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. స్టీఫెన్ నెడుంపల్లి మళ్ళీ ఖురేషి అబ్రమ్ గా ఎందుకు వెళ్ళాడు? అసలు ఖురేషి అబ్రమ్ గా ఎలా మారాడు? ప్రపంచంలో ఎన్నో దేశాలు అతని కోసం ఎందుకు వెతుకుతున్నాయి? అతని సొంత రాష్ట్రాన్ని కాపాడుకున్నాడా అనే ఆసక్తికర కథాంశంతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా మేకింగ్ మాత్రం అదిరిపోయింది అనిపిస్తుంది
మీరు కూడా L2E: ఎంపురాన్ ట్రైలర్ చూసేయండి..
Also See : Naga Chaitanya Sobhita : పెళ్లి తర్వాత నాగచైతన్య – శోభిత మొదటి ఫోటోషూట్.. ఫోటోలు వైరల్..
ఇక ఈ సినిమాలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు.