Rajamouli : మహేష్ సినిమా షూటింగ్ లొకేషన్ వీడియో షేర్ చేసిన రాజమౌళి.. ట్రెక్కింగ్ చేసి పైకెక్కి..
తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు.

Rajamouli Shares Mahesh Babu SSMB 29 Shooting Locations and Trekking Video
Rajamouli : మహేష్ బాబు – రాజమౌళి సినిమా ఇటీవల కొన్ని రోజులు ఓడిశాలోని కోరాపుట్ జిల్లాలో షూటింగ్ జరుపుకుంది. అక్కడి అడవుల్లో, కొండల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. రెండు రోజుల క్రితమే అక్కడి షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ నుంచి మహేష్, రాజమౌళి, ప్రియాంక ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రియాంక కూడా షెడ్యూల్ తర్వాత ఆ లొకేషన్స్ ని చూపిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసాడు. మహేష్ SSMB29 సినిమా షూట్ చేసిన కొండలు, అడవులు.. లొకేషన్స్ ని చూపిస్తూనే, అక్కడ ఓ ఎత్తైన కొండపైకి ట్రెక్కింగ్ చేశానంటూ ఈ వీడియోని షేర్ చేసాడు.
Also See : Naga Chaitanya Sobhita : పెళ్లి తర్వాత నాగచైతన్య – శోభిత మొదటి ఫోటోషూట్.. ఫోటోలు వైరల్..
రాజమౌళి ఈ వీడియో షేర్ చేసి.. ఒడిశాలోని అత్యంత ఎత్తైన మరియు అద్భుతమైన శిఖరం అయిన డియోమాలికి అద్భుతమైన సోలో ట్రెక్కింగ్ చేశాను. పై నుండి చూస్తే దృశ్యం చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ దారి అంతా చెత్తతో ఉండటం నిరాశపరిచింది. ఇలాంటి సహజమైన అద్భుతాలకు ఇంకా మంచి అర్హత ఉంది. మనకు కొంచెం జ్ఞానం ఉంటే ఆ తేడా కనిపిస్తుంది. ఈ ప్రదేశాలను రక్షించడానికి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు తమ చెత్తని పారేయకుండా తిరిగి తీసుకెళ్లాలి అంటూ పోస్ట్ చేసారు.
దీంతో ఇలాంటి అందమైన లొకేషన్స్ లో మహేష్ సినిమా షూట్ చేస్తున్నందుకు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేషున్నారు. ఇక ఇలాంటి విజిటింగ్ ప్లేసెస్ ని చెత్త వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడంతో నెటిజన్లు, పర్యావరణ ప్రేమికులు రాజమౌళిని అభినందిస్తున్నారు. మీరు కూడా రాజమౌళి షేర్ చేసిన వీడియోని చూసేయండి..