Mohanlal Prithviraj Sukumaran Lucifer 2 Empuraan shoot starts
Lucifer 2 Empuraan Movie Updates: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, మరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘లూసిఫర్’. 2019లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మలయాళ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. కాగా ఆ సినిమాని పృథ్వీరాజ్ ఓపెన్ ఎండింగ్ తోనే ముగించాడు. దీంతో సీక్వెల్ పై అప్పటినుంచే మంచి బజ్ నెలకుంది. పృథ్వీరాజ్ కూడా సీక్వెల్ తీసుకు వస్తాను అంటూ ప్రకటించాడు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సీక్వెల్ పట్టాలు ఎక్కుతుందా అని అందరు ఎదురు చూశారు.
ఇటీవలే ఈ సీక్వెల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ సీక్వెల్ కి ‘లూసిఫర్ 2 : ఎంపురాన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా నేడు ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టారు. పూజా కార్యక్రమాలు చేసుకొని షూటింగ్ ని మొదలు పెట్టాడు పృథ్వీరాజ్. అందుకు సంబంధించిన ఫోటోలను మోహన్ లాల్.. తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు తెలియజేశాడు. ఇక న్యూస్ తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : Skanda Collections : ఫస్ట్ వీక్‌లో హాఫ్ సెంచరీ కొట్టేసిన స్కంద..
ఇక మొదటి బాగానే కేవలం మలయాళంలో మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్. ఇప్పుడు ఈ సీక్వెల్ ని తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ మూవీని తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రీమేక్ చేశాడు. మూవీ బాగున్నప్పటికీ కమర్షియల్ గా ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ ని చిరంజీవి రీమేక్ చేసే అవసరం లేకుండా ఇక్కడ కూడా డైరెక్ట్ గా రిలీజ్ చేసేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగంలో నటించిన మంజు వారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్ వంటి నటీనటులు ఈ సీక్వెల్‌లో కూడా కనిపించనున్నారు.