Mouni Roy shocking post about karnal event incident.
Mouni Roy: బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. తన తాత వయసున్న వారు తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే. స్టార్ బ్యూటీ మౌనీ రాయ్(Mouni Roy) ఇటీవల కర్నాల్‌లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ కొందరు వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.
Divi Vadthya: ఏజ్ ఉంది వేసుకోండి.. అది మనకు తెలియదు కదా.. డ్రెస్సింగ్ పై దివి బోల్డ్ కామెంట్స్
ఈవెంట్ లో భాగంగా నేను వేదికపైకి వెళ్తున్నారు. అక్కడ నా తాత వయస్సున్న ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారు నన్ను ఫొటోస్ అడిగారు. ఫోటోలు తీసుకుంటూ నా నడుముపై చేతులు వేసి ఇబ్బంది పెట్టారు. ఇబ్బందిగా ఉంది చేయి తీయండి అను కూడా చెప్పాను. అయినా కూడా వినకుండా అలానే చేశారు. నేను స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్నప్పుడు కూడా అసభ్యకరమైన సైగలు చేశారు, వీడియోలు తీశారు.
అందరిముందే ఇంత జరుగుతున్నా షో నిర్వాహకులు, పెద్దలు కానీ వారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అది నాకు చాలా బాధను కలిగించింది. నాలాంటి ఎంతోకొంత ఫేమ్ ఉన్న నటికే ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే.. కొత్తగా వచ్చే వారి సంగతి ఏంటి? అధికారులు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ డిమాండ్ చేసింది మౌనీ రాయ్. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. మరి ఈ విషయాన్ని బాలీవుడ్ పెద్దలు ఎంత సీరియస్ గా తీసుకుంటారు అనేది చూడాలి.