Divi Vadthya: డ్రెస్సింగ్ పై దివి షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?
హీరోయిన్స్ డ్రెస్సింగ్ వివాదంపై బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా(Divi Vadthya).
divi vadthya bold comments on actress dressing
- ఏజ్ ఉంది వేసుకుంటే తప్పేంటి
- రోడ్ పై ఏమవుతుందో మనకు తెలియదు కదా
- బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ దివి దివి వడ్త్యా
Divi Vadthya: బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది దివి వడ్త్యా. అంతకు ముందు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన మహర్షి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాతో మంచి ఫేమ్ రావడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది.
Akhil Akkineni: ప్రశాంత్ నీల్ టీంలోకి అఖిల్.. నెక్స్ట్ సినిమా కోసం భారీ సెటప్.. ఇది కదా కావాల్సింది!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాథర్ సినిమాలో నటించింది. అయితే, హీరోయిన్ గా మాత్రం అసలు సక్సెస్ కాలేకపోయింది దివి వడ్త్యా(Divi Vadthya). ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ బ్యూటీ ప్రముఖ ఛానల్ లో పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఈ పాడ్ కాస్ట్ లో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంది ఈ బ్యూటీ. అలాగే, ఇటీవల వివాదాస్పందంగా మారిన హీరోయిన్స్ డ్రెస్సింగ్ గురించి కూడా స్పందించింది.
ఈ పాడ్ కాస్ట్ లో భాగంగా యాంకర్ ఇటీవల జరిగిన డ్రెస్సింగ్ వివాదం గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. దానికి సమాధానంగా దివి మాట్లాడుతూ.. ‘ఏజ్ ఉంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటారు. స్కర్ట్‌లు, షార్ట్‌లు, ఫ్రాక్‌లు వేసుకోండి. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా’
అంటూ హాట్ కామెంట్స్ చేసింది. దీంతో దివి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
