Mounika Reddy : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోయిన్‌గా మోనిక రెడ్డి ఎంట్రీ..
మరో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్ తో మౌనిక రెడ్డి..

Mounika Reddy lady oriented movie starts and poster release
Mounika Reddy : టాలీవుడ్‌కి ఇప్పుడప్పుడే తెలుగు అమ్మాయిలు రావడం మొదలు పెడుతున్నారు. ఇన్నాళ్లు షార్ట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ని అలరించి, అప్పుడప్పుడు పెద్ద సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన వైష్ణవి చైతన్య, మౌనిక రెడ్డిలు హీరోయిన్స్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ‘బేబీ’ సినిమాతో వైష్ణవి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాకే బలమైన పాత్రని ఎంచుకొని, తన నటనతో టాలీవుడ్ లోని ఇతర మేకర్స్ దృష్టిని వైష్ణవి ఆకర్షించింది.
7G Brindavan Colony : 7జీ బృందావన కాలని సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ.. వచ్చే నెల నుంచి..
తాజాగా మౌనిక కూడా అలాంటి ఒక బలమైన పాత్రతోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘భీమ్లానాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన ముఖ్య పాత్రలో నటించి టాలీవుడ్ లోని అందరి దృష్టిని ఆకర్షించిన మౌనిక.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో హీరోయిన్‌గా ఆడియన్స్ కి పరిచయం అవ్వబోతుంది. పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మౌనిక రాజ్యం కోసం పోరాడే యోధురాలు పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.
Harsha Sai : మొదటి మూవీకే ‘మెగా’ టైటిల్‌ని తీసుకున్న యూట్యూబర్ హర్ష సాయి.. టీజర్ చూశారా..?
View this post on Instagram
వారియర్ లేడీగా మౌనిక ఆకట్టుకుంటుంది. మొదటి సినిమాతోనే ఇలాంటి ఒక బలమైన పాత్రని ఎంచుకొని మౌనిక పెద్ద సాహసమే చేస్తుందని చెప్పాలి. ఈ చిత్రం ద్వారా రాకేష్ రెడ్డి యాస దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. సుధా క్రియేషన్స్ పతాకం మొదటి చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఫోక్ సాంగ్స్ కి కెమెరామెన్ వర్క్ చేసిన అరుణ్ కొలుగూరి ఈ మూవీకి డిఒపిగా చేస్తున్నాడు. ఈరోజు షూటింగ్ మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్ కంటిన్యూగా చిత్రీకరణను ముందుకు తీసుకు వెళ్లనున్నారు.
అలాగే త్వరలోనే టైటిల్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామంటూ మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాలో నటించడం గురించి మౌనిక మాట్లాడుతూ.. లేడీ ఓరియెంటెడ్ ఫిలింలో నటించడం చాలా సంతోషంగా ఉందని, తన క్యారక్టర్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారని చెప్పుకొచ్చింది.

Mounika Reddy lady oriented movie starts and poster release

Mounika Reddy lady oriented movie starts and poster release

Mounika Reddy lady oriented movie starts and poster release

Mounika Reddy lady oriented movie starts and poster release