Mega vs Manchu: ‘మా’ ఎన్నికలు : మంచు వర్సెస్ మెగాస్టార్ ఫ్యామిలీ

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ''ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్ తరపున పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు.

Movie Artists Association Elections Mega Vs Manchu Nagababu Supports Prakash Raj

Movie Artists Association (MAA): తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ”ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్ తరపున పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. ‘మా’ ఎన్నికలపై ఆసక్తి రెట్టింపయ్యింది.

మంచు విష్ణూ పోటీలోకి దిగడంతో ‘మా’ ఎన్నికలు ఇప్పుడు మెగా vs మంచుగా మారిపోయాయి. అందుకు కారణం మెగా కుటుంబమే. మా ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా వ్యవహరించే మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానెల్‍కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. మరోవైపు మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు పోటీ చేయబోతున్నారు.

కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పటికే విష్ణు అధికారికంగా ప్రకటించారు. దీంతో గతంలో హీట్ కంటే ఎక్కువ హీట్ రెండు ప్యానెళ్ల మధ్య ఉంటుందని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నాగబాబు.. 2019 ఎలక్షన్స్‌లో నరేష్ ప్యానెల్‌కు సపోర్ట్ చేశారు. శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరకు నరేష్ గెలిచారు.

ఇదిలా ఉంటే మంచు మోహన్‌బాబుకు చిరంజీవికి మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి పరిస్థితిలో మంచు విష్ణు, చిరంజీవిని ప్రత్యక్షంగా కలిసి సపోర్ట్ కోరే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే, మంచు విష్ణూకు చిరంజీవి సపోర్ట్ చేస్తారా? తన బ్రదర్ నాగబాబు సపోర్ట్ ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్ రాజ్‌కే చిరంజీవి సపోర్ట్ చేస్తారా? అనేది ఆసక్తికరమే.