Mrunal Thakur
Mrunal Thakur : కరోనావైరస్ మహమ్మారి మరోసారి బాలీవుడ్ లో కలకలం రేపుతోంది. క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన వారు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కరోనా సోకగా, తాజాగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ వైరస్ బారిన పడింది. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్లు మృణాల్ తెలిపింది. తనను కాంటాక్ట్ అయిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. మృణాల్ ఠాకూర్ షాహిద్ కపూర్ జెర్సీ సినిమాలో నటించింది. మృణాలో కరోనా బారిన పడిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్ లక్షణం కావొచ్చు..!
కాగా, ఇటీవలే నటి నోరా ఫతేహి సైతం కరోనా బారిన పడింది. దురదృష్టవశాత్తు తాను కరోనా బారిన పడ్డానని స్వయంగా నోరా తెలిపింది. కరోనాతో తాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పింది. కొన్ని రోజులుగా తాను బెడ్ కే పరిమితమయ్యానని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని కోరింది.
Vitamin D : శరీరానికి ఎండ తగలకపోతే… విటమిన్ డి లోపిస్తుందా?
మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని… ప్రతి ఒక్కరిని తాకే అవకాశం ఉందని నోరా చెప్పింది. తాను అనుభవిస్తున్న బాధ ఎవరూ అనుభవించకూడదని అంది. ఆరోగ్యం కంటే మనకు ఏదీ ఎక్కువ కాదని చెప్పింది.