Vitamin D : శరీరానికి ఎండ తగలక పోతే… విటమిన్ డి లోపిస్తుందా?…

విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు జున్ను, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.

Vitamin D : శరీరానికి ఎండ తగలక పోతే… విటమిన్ డి లోపిస్తుందా?…

Vitamin D

Vitamin D : మన దేశ జనాభాలో 72 శాతం మంది ప్రజలు విటమిన్ డి, లోపంతో బాధపడుతున్నారన్న నిపుణులు ప్రకటన ఆందోళన రేకెత్తిస్తుంది. విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యమైనది. రోజులో శరీరానికి సూర్యరశ్మి తగలక పోవటం వల్లే అధిక భాగం విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఆహారంలో దొరికే విటమిన్ డి అన్ ప్రాసెస్డ్ విటమిన్ గా చెప్తారు. విటమిన్ డి లోపం కారణంగా స్కిన్ డ్రై అవ్వటం, జుట్టు ఊడటం, ఎముకల్లో పటుత్వం కోల్పోవటం సమస్యలు ఉత్పన్నమౌతాయి.

ఇటీవలి కాలంలో 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. విటమిన్ డి అనేది శరీరానికి రోగనిరోధక శక్తిని ఇవ్వటంలో ఎంతో ఉపయోగపడుతుంది. విటమిన్ డి లోపం కారణంగా గుండెజబ్బులు, జాయింట్ పెన్స్, హైపర్ టెన్షన్ , వంటి సమస్యలు ఉత్పన్నమౌతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. విటమిన్ డి లోపం కారణంగా దీర్ఘకాలికమైన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

విటమిన్ డి లోపం ఉండడం వల్ల శారీరక సమస్యలు మరియు మానసిక సమస్యలు కూడా వస్తాయి. ప్రతి మనిషిలో విటమిన్ డి ఎంత ఉందన్న విషయాన్ని రక్తపరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా లోపం ఉంటే వైద్యుల సూచనలను తీసుకోవాలి. సూర్యరశ్మి ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ డిని పొందటం ఉత్తమమైన పద్దతని వైద్యులు సూచిస్తున్నారు. సూర్యరశ్మి శరీరానికి రోజు తగలటం వల్ల బలహీనత, కండరాల నొప్పి, క్యాన్సర్, క్షయ వంటి వ్యాధులను నివారించవచ్చు.

విటమిన్ డి లోపాన్ని నివారించేందుకు జున్ను, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పాలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. సూర్యరశ్మి నుండి విటమిన్ డి పొందేందుకు శీతాకాలంలో అయితే ఉదయం రెండుగంటల సేపు ఎండ వేడి శరీరానికి తగిలేలా చూసుకుంటే విటమిన్ డి పొందవచ్చు. అలాగే ఎండాకాలంలో ఉదయం 20 నిమిషాల పాటు ఎండ వేడి తగిలితే శరీరానికి కావాల్సిన రోజు వారీ డి విటమిన్ లభిస్తుంది.

ముఖ్యంగా మహిళల్లో ఇటీవలి కాలంలో విటమిన్ డి లోపం అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే వారు ఇంటికే పరిమితం కావటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వంటి కారణాల వల్ల వారిలో విటమిన్ డి లోపం తలెత్తుతుంది.దీని వల్ల వారు తీవ్రమైన తలనొప్పి, చర్మ సంబంధిత సమస్యల భారిన పడుతున్నారు.