Munawar Faruqui : బిగ్‌బాస్ విజేతపై కోడిగుడ్లతో దాడి.. గొడవకు దిగిన బిగ్ బాస్ విన్నర్..

తాజాగా మునావర్ ఫరూఖీపై కోడిగుడ్లతో దాడి చేసారు.

Munawar Faruqui : బిగ్‌బాస్ విజేతపై కోడిగుడ్లతో దాడి.. గొడవకు దిగిన బిగ్ బాస్ విన్నర్..

Munawar Faruqui pelted with eggs at Mumbai Video goes Viral

Updated On : April 12, 2024 / 6:57 AM IST

Munawar Faruqui : బాలీవుడ్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూఖీ సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకొని టీవీ షోలలోకి వచ్చాడు. 2023లో హిందీ బిగ్ బాస్ 17వ సీజన్ లో పాల్గొని విన్నర్ గా నిలిచాడు. అయితే ఇప్పటికే మునావర్ ఫరూఖీ బిహేవియర్ వల్ల అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో ఓ గొడవలో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదయింది.

తాజాగా మునావర్ ఫరూఖీపై కోడిగుడ్లతో దాడి చేసారు. రంజాన్ సందర్భంగా ముంబై మొహమ్మద్ అలీ రోడ్ లో ఓ ఇఫ్తార్ పార్టీకి మునావర్ వెళ్ళాడు. అయితే అతన్ని పిలిచిన రెస్టారెంట్ కి కాకుండా ఇంకో రెస్టారెంట్ కి ఇఫ్తార్ పార్టీకి వెళ్ళడానికి మునావర్ సిద్దపడినట్టు సమాచారం. ఈ క్రమంలో పార్టీకి స్వీట్స్ కొనుక్కుందామని ఓ స్వీట్ షాప్ లో ఆగగా మునావర్ ఫరూఖీని పార్టీకి పిలిచిన రెస్టారెంట్ యజమాని, అతని షాప్ లో పనిచేసే వాళ్ళు కోడిగుడ్లతో మునావర్ పై దాడి చేశారు.

Also Read : Oscars 2025 : 97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక డేట్ ఫిక్స్.. నామినేషన్స్ అనౌన్స్ చేసేది అప్పుడే..

ఈ దాడి అక్కడ ఉద్రిక్తతకు దారి తీసింది. మునావర్ కూడా వారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో కొంతమంది వచ్చి మునావర్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటన మొన్న రాత్రి జరిగిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మునావర్ ఫరూఖీపై కోడిగుడ్ల దాడి జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.