Oscars 2025 : 97వ ఆస్కార్ అవార్డుల వేడుక డేట్ ఫిక్స్.. నామినేషన్స్ అనౌన్స్ చేసేది అప్పుడే..
తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ.

The Academy 97th Oscars Dates was Announced
Oscars 2025 : ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఆస్కార్ కోసం కలకంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డుల్లో టాప్ ఆస్కార్ అవార్డు. అది సాధించాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా రాజమౌళి, RRR వల్ల నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మార్చ్ లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ.
Also Read : Mahesh – Sitara : కూతురితో మహేష్ క్యూట్ ఫొటో.. యూరప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా..
ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్ కు సినిమాల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. 2025 జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ లో ఉన్న సినిమాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8తో ఓటింగ్ ముగుస్తుంది. 2025 మార్చ్ 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్‌లో 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగనున్నట్టు అకాడమీ సంస్థ ప్రకటించింది. మరి ఈ సారి ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంటాయో చూడాలి.
Mark your calendars! The 97th Oscars will take place on Sunday, March 2, 2025.
Nominations will be announced on Friday, January 17, 2025. pic.twitter.com/eJWgkvNL5S
— The Academy (@TheAcademy) April 10, 2024