Mahesh – Sitara : కూతురితో మహేష్ క్యూట్ ఫొటో.. యూరప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా..

తాజాగా మహేష్ యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు.

Mahesh – Sitara : కూతురితో మహేష్ క్యూట్ ఫొటో.. యూరప్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా..

Mahesh Babu Shares Cute Photo with Daughter Sitara from Europe Trip

Updated On : April 11, 2024 / 8:24 PM IST

Mahesh – Sitara : మహేష్ బాబు టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే. ఇటీవల 15 రోజుల క్రితం మహేష్ బాబు తన ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ కి వెళ్లారు. ట్రిప్ లోఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. ఇన్ని రోజులుగా మహేష్ ఏ ఫొటోలు షేర్ చేయకపోయినా నమ్రత, సితార మాత్రం రెగ్యులర్ గా తమ యూరప్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

దీంతో మహేష్ వెకేషన్ వైరల్ గా మారింది. తాజాగా మహేష్ యూరప్ ట్రిప్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. అయితే ఫ్యామిలీతో కాకుండా అక్కడి ప్రదేశాలను ఎక్కువగా షేర్ చేసారు. తన కూతురు సితారతో కలిసి దిగిన ఓ క్యూట్ ఫొటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ తన కూతురుని ప్రేమగా హత్తుకొని ఉన్నాడు. అయితే ఈ ఫొటోలో మహేష్ జుట్టు కూడా బాగా పెంచినట్టు కనిపిస్తుంది.

Mahesh Babu Shares Cute Photo with Daughter Sitara from Europe Trip

Also Read : రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ..

దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటో చూసి బెస్ట్ ఫాదర్ – డాటర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ పెరిగిన జుట్టుని గమనించిన వాళ్ళు రాజమౌళి సినిమా కోసమే జుట్టు పెంచుతున్నాడా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సితార, గౌతమ్ లు ఉన్న ఫొటో కూడా షేర్ చేసాడు మహేష్ బాబు. దీంతో మహేష్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.