రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ..

తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది.

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. డాక్టరేట్ ప్రకటించిన ప్రముఖ యూనివర్సిటీ..

Charan for his Contribution to Cinema

Updated On : April 11, 2024 / 7:38 PM IST

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. RRR తో వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా, ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రకాలుగా ప్రఖ్యాత కార్యక్రమాల్లో పాల్గొని గుర్తింపు సంపాదించుకున్నారు చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ కి ఏకంగా డాక్టరేట్ ప్రకటించింది ఓ ప్రముఖ యూనివర్సిటీ. తమిళనాడు చెన్నైకి చెందిన వేల్స్‌ యూనివర్సిటీ(Vels University) రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఈ యూనివర్సిటీలో జరగనున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. చరణ్ తో పాటు పలువురు తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్టు సమాచారం.

Also Read : Jr NTR : ముంబైలో అడుగు పెట్టిన ‘దేవర’.. ఇక ‘వార్’ మొదలు.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు..

ఆ రోజున ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ ఈ డాక్టరేట్ అందుకుంటారని సమాచారం. కళారంగానికి చరణ్ చేసిన సేవలకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. దీంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Tamilnadu Vels University Announce Doctorate to Ram Charan for his Contribution to Cinema