Jr NTR : ముంబైలో అడుగు పెట్టిన ‘దేవర’.. ఇక ‘వార్’ మొదలు.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు..

ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇవాళ ఎన్టీఆర్ ముంబైలో దిగారు.

Jr NTR : ముంబైలో అడుగు పెట్టిన ‘దేవర’.. ఇక ‘వార్’ మొదలు.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు..

Jr NTR joining in War 2 Shoot Mumbai Visuals goes Viral

Updated On : April 11, 2024 / 4:48 PM IST

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూట్ తో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పార్ట్ 1ని దసరాకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ దేవరతో(Devara) పాటు వార్ 2(War) షూట్ కి కూడా డేట్స్ ఇచ్చాడు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేయబోతున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్స్ లో యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతుంది.

ఆల్రెడీ వార్ 2 సినిమా షూటింగ్ మొదలయి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఆర్ ముంబైలో దిగారు. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లినట్టు సమాచారం. రేపట్నుంచి వారం రోజుల పాటు ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాత మళ్ళీ దేవర షూట్ లోకి రానున్నట్టు తెలుస్తుంది.

Also Read : Gopichand – Sreenu Vaitla : గోపీచంద్ – శ్రీను వైట్ల సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. అందర్నీ కాల్చేసి బిర్యానీ తింటూ..

ఇక ఎన్టీఆర్ ముంబై విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టైలిష్ గా క్యాప్, కళ్ళజోడు పెట్టి అందరికి హాయ్ చెప్తూ, మీడియా ముందుకు వచ్చిన విజువల్స్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో బాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు అంటూ పోస్టులు చేస్తున్నారు. ఇక వార్ 2 సినిమా 2025 ఆగస్టు 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.