C 202 Movie : ఆ థియేటర్స్ లో త్వరలో 50 రోజులు పూర్తిచేసుకోబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా..

'సి 202' సినిమా అక్టోబర్ 25న విడుదలయింది.

C 202 Movie : ఆ థియేటర్స్ లో త్వరలో 50 రోజులు పూర్తిచేసుకోబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా..

Munna Kasi C 202 Horror Thriller Movie Ready to Complete 50 Days

Updated On : December 2, 2024 / 8:19 PM IST

C 202 Movie : మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కెఎ నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించారు. హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ ‘సి 202’ సినిమా అక్టోబర్ 25న విడుదలయింది. ఈ సినిమాలో షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Pushpa 2 Security : హైదరాబాద్ పుష్ప 2 ఈవెంట్.. మొదటిసారి 1000 మంది పోలీసులతో భద్రత..

అయితే ఈ సినిమా గత ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ.. లోని పలు థియేటర్స్ లో ఆడుతుంది. తాజాగా ఏడో వారంలోకి అడుగుపెట్టి మరి కొన్ని రోజుల్లో 50 రోజులు పూర్తిచేసుకోనుంది.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు మున్నా కాశీ మీడియాతో మాట్లాడుతూ.. సి 202 సినిమా అక్టోబర్ 25న విడుదలయింది. మంచి రివ్యూస్ తో పాటు మౌత్ టాక్ తో ఆడియన్స్ ని మెప్పించి ఇప్పటికే ఆరు వారాలు పూర్తిచేసుకుంది. మా సినిమా వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. ఇప్పటికే మా సినిమా ఆల్మోస్ట్ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని తెలిపారు.