Munna Kasi C 202 Movie First Look Released
C 202 Movie : మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కెఎ నిర్మాణంలో మున్నా కాశి(Munna Kasi) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ సినిమా ‘సి 202’. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ముఖ్య పాత్రల్లో గోవా భామ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
‘సి 202’ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా అంతా రాత్రిపూటే షూటింగ్ చేయడం గమనార్హం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా ‘సి 202’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
Also Read : Rajinikanth : ‘అర్థమైందా రాజా’.. నేను అన్నది తప్పుగా ప్రమోట్ చేశారు.. చాలా బాధపడ్డాను..
ఈ సందర్భంగా హీరో, డైరెక్టర్ మున్నా కాశి మాట్లాడుతూ.. మా ‘సి 202’ సినిమా మొత్తం రాత్రిపూట షూట్ చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే సస్పెన్స్ కథనంతో, భయపడే హారర్ సన్నివేశాలతో ఈ సినిమాని తీశాము. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో 21 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. ప్రస్తుతం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నాము. త్వరలోనే ప్రమోషన్స్ మొదలుపెడతాం. నా గత సినిమా హేజా(Heza) మంచి విజయం సాధిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే హేజా 2 కూడా మొదలుపెడతాం అని తెలిపారు.