Rajinikanth : ‘అర్థమైందా రాజా’.. నేను అన్నది తప్పుగా ప్రమోట్ చేశారు.. చాలా బాధపడ్డాను..

లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ కి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రజిని మాట్లాడిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Rajinikanth : ‘అర్థమైందా రాజా’.. నేను అన్నది తప్పుగా ప్రమోట్ చేశారు.. చాలా బాధపడ్డాను..

Super Star Rajinikanth gives Clarity on Jailer Event Speech Issue in Lal Salaam Movie Event

Updated On : January 27, 2024 / 5:10 PM IST

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ 70 ఏళ్ళు దాటినా ఇప్పటికి అదే గ్రేస్ తో అభిమానుల కోసం సినిమాలు తీస్తున్నారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రజినీకాంత్ మొయినుద్దీన్ అనే ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి నుంచి వాయిదా పడింది. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇందులో జీవిత రాజశేఖర్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషించింది.

తాజాగా లాల్ సలామ్(Lal Salaam) సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్ కి రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రజిని మాట్లాడిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలో జైలర్ సక్సెస్ మీట్ లో రజినీకాంత్ మాట్లాడుతూ.. మొరిగే కుక్క లేదు, విమర్శించని నోరు లేదు. ఇవి రెండు జరగని ఊరు లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి అని చివర్లో అర్థమైందా రాజా అని అన్నారు. దీంతో ఈ డైలాగ్ వైరల్ అయింది. కొంతమంది ఇది ఒక పార్టీకి కౌంటర్ అని అనుకోగా చాలామంది తమిళ్ వాళ్ళు మాత్రం హీరో విజయ్ కి కౌంటర్ అనుకున్నారు. ఆ సమయంలో విజయ్ కి సూపర్ స్టార్ ట్యాగ్ ఇవ్వాలని అభిమానులు రచ్చ చేస్తుండటం, విజయ్ అభిమానులు రజినీకాంత్ ని ట్రోల్ చేయడంతోనే రజిని ఈ కామెంట్స్ చేసారని విజయ్ అభిమానులు అనుకోని రజినీకాంత్ ని మరింత ట్రోల్ చేశారు. అప్పట్లో అర్థమైందా రాజా అనే డైలాగ్ బాగా వైరల్ అయింది.

Also Read : Salaar Goes Global : వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతున్న ప్రభాస్.. ‘సలార్’ హవా.. RRR తర్వాత మళ్ళీ ఇప్పుడే..

తాజాగా జరిగిన లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో రజినీకాంత్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. రజినీకాంత్ మాట్లాడుతూ.. జైలర్ సినిమా ఈవెంట్లో నేను అర్థమైందా రాజా అన్న వ్యాఖ్యలని చాలామంది తప్పుగా ప్రమోట్ చేశారు. నేను మాములుగా చెప్పిన ఆ మాటలని విజయ్ ని అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ చేసారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. చంద్రశేఖర్ గారు వాళ్ళ అబ్బాయిని యాక్టర్ చేస్తున్నాను అని నాకు పరిచయం చేశారు. విజయ్ ని నేను చిన్నపట్నుంచి చూస్తున్నాను. విజయ్ నా కళ్ళముందు పెరిగి కష్టపడి ఇప్పుడున్న స్థాయికి చేరుకున్నాడు. అలాంటి వ్యక్తిపై నేనెందుకు కామెంట్లు చేస్తాను. నాకు ఎవరూ పోటీ కాదు. నేను ఎవరికీ పోటీ కాదు. నాతో నాకే పోటీ. అభిమానులకు ఒక్కటే చెప్తున్నా మా ఇద్దర్ని పోల్చి చూడకండి అని అన్నారు. దీంతో రజినీకాంత్ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాట వైరల్ గా మారాయి.