×
Ad

Music Director Bunty : సీరియల్ సాంగ్స్ తీసేస్తున్నారు.. బాధపడుతున్న మ్యూజిక్ డైరెక్టర్.. అన్ని ఛానల్స్ ని వేడుకున్నాను..

రీసెంట్ టైమ్స్ లో అసలు సీరియల్ స్టార్ట్ అయ్యేముందు సీరియల్ సాంగ్స్ కూడా వేయట్లేదు.(Music Director Bunty)

Music Director Bunty

Music Director Bunty : ఒకప్పుడు టీవీ సీరియల్స్ కి కూడా సాంగ్స్ ఉండేవి. ఋతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, పిన్ని, కస్తూరి, అందం, మెట్టెలసవ్వడి. లేడి డిటెక్టీవ్, కళంకిత, అన్వేషణ, నాగమ్మ, అమృతం.. ఇలా చాలా సీరియల్స్ కి టైటిల్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ అన్ని పెద్ద హిట్ అయ్యాయి. సాంగ్స్ తో పాటు సీరియల్స్ కూడా హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు సీరియల్స్ కి సాంగ్స్ ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా అంతగా ప్రజాదారణ పొందట్లేదు.(Music Director Bunty)

రీసెంట్ టైమ్స్ లో కార్తీక దీపం సీరియల్ సాంగ్ తప్ప వేరే ఏ సీరియల్ సాంగ్ అంత పెద్ద హిట్ అవ్వలేదు. అసలు సీరియల్ స్టార్ట్ అయ్యేముందు సీరియల్ సాంగ్స్ కూడా వేయట్లేదు. తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ బంటి స్పందించారు.

Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..

ఋతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, కస్తూరి.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కి సాంగ్స్ పాడి కంపోజ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్ బంటి. దాదాపు 70 సీరియల్స్ కి పైగా ఆయన పనిచేసారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బంటి మాట్లాడుతూ.. ఇటీవల సీరియల్ స్టార్ట్ అయ్యేముందు సాంగ్ తీసేసి డైరెక్ట్ సీరియల్ లోకి వెళ్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ క్రియేటివిటిని తొక్కేస్తున్నారు. పాట అనేది సీరియల్ కి వెల్కమ్ లాంటిది. ఇప్పుడు సీరియల్స్ కి పాట చేసినా ఒక వారం కూడా వేయట్లేదు. తర్వాత పాట తీసేసి సీరియల్ చూపిస్తున్నారు. పాట తీసేసి ఇంకో యాడ్ వేసుకోవచ్చు ఆ ప్లేస్ లో, కమర్షియల్ గా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. నేను అన్ని టీవీ ఛానల్స్ కి ఇప్పటికే రిక్వెస్ట్ చేసాను సీరియల్ సాంగ్స్ కట్ చేయొద్దు అని. ఇప్పుడు కూడా చెప్తున్నాను సీరియల్ సాంగ్స్ ని దయచేసి తీసేయకండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ని తొక్కేయకండి అని అన్నారు.

Also Read : Uppena : వామ్మో ‘ఉప్పెన’ సినిమాకు అంత బడ్జెట్ అయిందా? దెబ్బకు నిర్మాత బుచ్చిబాబుకి ఫోన్ చేసి..