Uppena : వామ్మో ‘ఉప్పెన’ సినిమాకు అంత బడ్జెట్ అయిందా? దెబ్బకు నిర్మాత బుచ్చిబాబుకి ఫోన్ చేసి..
ఉప్పెన సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది. (Uppena)

Uppena
Uppena : కరోనా తర్వాత 2021లో వచ్చిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. హీరో – హీరోయిన్, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక్కరే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.(Uppena)
అసలు అందరూ కొత్తవాళ్లను పెట్టి కరోనా సమయంలో సినిమా అంటే ఎంత తక్కువలో తీస్తారు. కానీ ఉప్పెన సినిమాకు భారీగానే బడ్జెట్ అయింది.
Also Read : Mamitha Baiju : ‘డ్యూడ్’ హీరోయిన్ కి రామ్ చరణ్ సినిమా అంటే చాలా ఇష్టం అంట.. ఏం సినిమానో తెలుసా?
తాజాగా ఓ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు సాన మాట్లాడుతూ.. నేను మైత్రీ మూవీస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసాను. తర్వాత ఉప్పెనతో డైరెక్టర్ అయ్యాను. ఉప్పెన టైంలో నేను ఎవరో తెలీదు, వైష్ణవ్, కృతి ఎవరో తెలీదు. కానీ మా మీద బాగా బడ్జెట్ పెట్టారు. ఎంత బడ్జెట్ అవుతున్నా ఏమనలేదు. ఓ రోజు నవీన్ గారు అమెరికా నుంచి కాల్ చేసి బుచ్చి నీకు అర్ధమవుతుందా 20 కోట్లు దాటిపోతుంది బడ్జెట్ అని అన్నారు. నేను అవునా సర్ అన్నాను అంతే. ఒక్క మాట కూడా అనలేదు ఆయన. మమ్మల్ని నమ్మారు. అంతలా సపోర్ట్ చేసారు అని తెలిపాడు.
అయితే ఉప్పెన సినిమాకు మొత్తం 22 కోట్ల బడ్జెట్ అయింది. ఆ సినిమాలో సాంగ్స్ ముందే పెద్ద హిట్ అవ్వడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కరోనా తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ రావడంతో జనాలు కూడా థియేటర్స్ కి వెళ్లి చూసారు. ఈ సినిమా ఏకంగా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది. అయితే ఇంతమంది కొత్తవాళ్ళ మీద ఏకంగా 22 కోట్లు బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యకర విషయమే. ఆ సమయంలో 22 కోట్లు కొత్తవాళ్ళ మీద బడ్జెట్ అంటే చాలా ఎక్కువే, రిస్క్ కూడా.
Also Read : K Ramp Review : ‘K ర్యాంప్’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం మాస్ ఎంటర్టైన్మెంట్ చూపించాడుగా..